గత కొంతకాలంగా వరస పరాజయాలతో సతమతమవుతున్న నాగార్జున తిరిగి హిట్ ట్రాక్ లోకి రావడానికి ప్రస్తుతం నానీతో ఒక మల్టీ స్టారర్ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తీస్తున్న ఈమూవీలో నాగార్జున గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తే నాని డాక్టర్ గా కనిపించపోతున్నాడు. 
Nagarjuna, Nani
సుమారు పది సంవత్సరాల క్రితం బాలీవుడ్ లో విడుదలై హిట్ కొట్టిన ‘జానీ గద్దర్’ మూవీకి మార్పులు చేర్పులు చేసి ఈ మూవీని తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి అయిన ఈమూవీకి మరింత క్రేజ్ తీసుకురావడానికి ఈసినిమా దర్శక నిర్మాతలు ఒక షాకింగ్ టైటిల్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 
Watch Shikhar Dhawan & Hardik Pandya Dance
తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమాకు ‘దేవదాసు’ అన్న టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు టాక్. అక్కినేని నాగేశ్వరావు కెరియర్ బెస్ట్ క్లాసిక్ మూవీగా పేరు గాంచిన ‘దేవదాసు’ టైటిల్ ను నాగార్జున నానీల మూవీకి ఉపయోగిస్తే క్రేజ్ పరంగానే కాకుండా ఈమూవీ బిజినెస్ కూడ భారీ స్థాయిలో జరుగుతుందని నిర్మాత అశ్వినీదత్ ప్లాన్ అని కూడ అంటున్నారు. ఈసినిమాలో నాగార్జున పాత్ర పేరు ‘దేవ్’ అయితే నాని పాత్ర పేరు ‘దాస్’ అని సమాచారం. 
nagarjuna to share screen with nani in next
దీనితో ఈరెండు పాత్రల పేర్లను కలిపి ఇలా ‘దేవదాసు’ ప్రయోగం చేస్తున్నారని తెలుస్తోంది. కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా తీయబడుతున్న ఈమూవీలో ఎంతో కీలకమైన ఎమోషనల్ సీన్స్ ఈమధ్య చిత్రీకరిస్తున్న నేపధ్యంలో నిర్మాత అశ్వినీదత్ కు వచ్చిన ఈ ‘దేవదాసు’ ఆలోచనలను వెంటనే నాగార్జున ఓకె చేసాడని సమాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ తో పాటు మార్కెట్ కూడ కొనసాగుతున్న నేపధ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఈమూవీని విడుదల చేసే ప్రణాళికలో ఈ టైటిల్ తో త్వరలో ఈమూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: