బాలకృష్ణకు జూనియర్ కు మధ్య సన్నిహిత సంబంధాలు లేవు అంటూ ఎన్నో వార్తలు గత కొంత కాలంగా హడావిడి చేస్తూనే ఉన్నాయి. దీనికితోడు వీరిద్దరూ ఒకే ఫంక్షన్ లో కలిసిన సందర్భాలు లేకపోవడంతో ఈ వార్తలలో నిజం ఉందా అన్న సందేహాలు నందమూరి అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. 
చిన్నోడు భార్గవరామ్
అయితే ఈ అనుమానాలకు జూనియర్ అనుకోకుండా తన రెండవ కొడుకు పేరు పెట్టడం ద్వారా చెక్ పెట్టాడా అని అనిపించడం సహజం. తన రెండవ కొడుకు పేరును భార్గవ రామ్ గా పెట్టినట్లు జూనియర్ తన అభిమానులకు తెలియ చేస్తూ దీనికి సంబంధించిన ఒక ఫోటోను ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసాడు. 
తమ్ముడితో అభయ్ రామ్
తన చిన్న కొడుకుకి పేరు పెట్టె కార్యక్రమం చాల ఘనంగా నిర్వహించాము అంటూ జూనియర్ తన చిన్న కొడుకును తన పెద్ద కొడుకు అభయ్ రామ్ ఎత్తుకుని ఉన్న ఫోతోను తీసి అందరికీ షేర్ చేసాడు. అయితే అనూహ్యంగా బాలకృష్ణ జూనియర్ చిన్నకొడుకు పేరును తలపించే విధంగా ‘భార్గవ రాముడు’ అన్న సినిమాను కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1987 లో నటించాడు.అప్పట్లో ఈమూవీ సూపర్ హిట్. 

ఇప్పుడు ఇలా జూనియర్ తన చిన్న కొడుకుకు భార్గవ రామ్ అన్న పేరు పెట్టడంతో అన్యాపదేశంగా తాను తన బాబాయ్ ఒకటే సంకేతాలు ఇస్తున్నాడు అంటూ బాలయ్య అభిమానులు సంబర పడుతున్నారు. వాస్తవానికి జూనియర్ ఆలోచనలలో ఏ ఉద్దేశ్యంతో ఈపేరు పెట్టిందో తెలియకపోయినా బాలయ్యా జూనియర్ ల మధ్య ఏర్పడిన దూరాన్ని జూనియర్ చిన్న కొడుకు దూరాన్ని తగ్గిస్తాడేమో అని అనిపించడం సహజం. రాబోతున్నది ఎన్నికల సంవత్సరం కాబట్టి తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ బాలకృష్ణలు ఒకటిగా మారి ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..  


మరింత సమాచారం తెలుసుకోండి: