మెగా స్టార్ చిరంజీవి కుటుబం పేరు చేపితే చాలు ఆకుటుంబ హీరోలను ఎలా టార్గెట్ చేయాలి అంటూ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రకరకాల ప్లాన్స్ ఆలోచిస్తూనే ఉంటాడు. చిరంజీవి పవన్ ల దగ్గర నుండి  మెగా హీరోలు అందరు వర్మ సెటైర్ల భాదితులే. ఈనేపధ్యంలో చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయంకాబోతున్న ‘విజేత’ సినిమాను టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ శిష్యుడి సినిమా రాబోతోంది. 
హీరో క్యారెక్టర్ ఆధారంగానే
‘అర్జున్ రెడ్డి’ స్టయిల్ లో కొంచెం డిఫరెంటుగా ఉంటుంది అని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో ప్రీ పాజిటివ్ రిలీజ్ టాక్ ను తెచ్చుకున్న ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా రిలీజ్ డేట్ కూడ ఈనెల 12వ తేదీకే ఫిక్స్ అయింది.  ఇప్పటికే వెరైటీ ప్రోమోలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈమూవీని రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి  తీసాడు. 
అప్పుడే ఫిక్స్ అయ్యాను
ఈ చిత్రం రిలీజ్‌ కు ముందే మంచి టాక్‌ తో మార్కెట్ అవుతోంది. గోదావరి జిల్లా నేటివిటితో పూర్తిస్థాయి ప్రేమకథగారూపొందించిన ఈమూవీ కథ ‘ఆర్ ఎక్స్ 100 బైక్’ నడిపే వారులా చాలా ఎమోషనల్‌గా ఉద్రేకపూరితంగా ఉంటుంది అని తెలుస్తోంది. ఈమూవీ కధలో బైక్‌ కు ప్రాధాన్యత ఉన్న నేపద్యంలో ఇలాంటి టైటిల్ పెట్టాను అని అంటున్నాడు ఈ మూవీ దర్శకుడు. 
RX 100 Movie New Still
దీనికితోడు ఈమూవీలోని హీరో పాత్ర ‘అర్జున్ రెడ్డి’ సినిమాలోని విజయ్ దేవరకొండ పాత్రలా చాలా రెబెల్ గా ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. దీనితో రెబల్ వాసనలు ఉన్న ఒక యూత్ ఫిలింకు ఫ్యామిలీ సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న ఒక ఫ్యామిలీ మూవీకి పోటీ ఏర్పడి అది అముకోకుండా మెగా ఫ్యామిలీ రామ్ గోపాల్ వర్మల వార్ గా మారింది అని అంటున్నారు. పోటీ లేకుండా విడుదల చేద్దాం అని ‘విజేత’ నిర్మాతలు భావిస్తూ ఉంటే ఇప్పుడు ఈసినిమాకు అనూహ్యంగా వర్మ శిష్యుడు పోటీ ఇవ్వబోతు ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: