బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్రను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకోని నిర్మిస్తున్నాడు. ఎన్ని కోట్లు ఖర్చు అయినా వెనుకడుగు వేయడం లేదు. అందుకే పెద్ద హీరో, హీరోయిన్స్ తన సినిమా లో కి తెప్పిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో తెలుగు స్టార్ హీరో రానా దగ్గుబాటి నటిస్తున్నాడని ఫిక్స్ అయిపోయింది. ఇప్పడు బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్ నటీ విధ్య బాలన్ ను ఫైనల్ చేసినట్టు అఫిషియల్ సమాచారం వచ్చింది. 

Image result for vidya balan

ఈ మేరకు ట్రేడ్ ఎనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. విద్యా తరఫు నుంచి అధికారికంగా ఈ విషయంపై ధ్రువీకరణ అందిందని తరణ్ పేర్కొన్నాడు. ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం పాత్రలో విద్య నటించబోతోందని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై సంప్రదింపులు జరిగినట్టుగా అప్పట్లో మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే మొదట విద్య నో చెప్పిందని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో ఎలాగూ ఆ పాత్రకు పెద్ద ప్రాధాన్యత ఉండకపోవచ్చు అనే అభిప్రాయం కూడా వినిపించింది. అయితే తండ్రి బయోపిక్ పాత్రను చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు బాలయ్య.

Image result for vidya balan

ఎన్ని కోట్ల రూపాయల పారితోషకానికి అయినా సై అనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే తల్లి పాత్ర ప్రాధాన్యతను పెంచుతూ కూడా సీన్లను రాయించగల సమర్థుడే. ఈ నేపథ్యంలో విద్యాబాలన్‌ను ఈ సినిమా కోసం ఒప్పించినట్టుగా ఉన్నారు. దక్షిణాది అమ్మాయే అయిన విద్యాబాలన్ కెరీర్ ఆరంభంలో దక్షిణాది సినిమాల్లో నటించడానికి తీవ్రంగా ప్రయత్నించింది. అయితే అప్పట్లో ఈమెకు అవకాశాలు రాలేదు. కొన్ని సినిమాల్లో ఈమెనే హీరోయిన్‌గా ప్రకటించి, ఆ తర్వాత చివర్లో తప్పించారు. అలా విద్య కోల్పోయిన అవకాశాలు చాలానే ఉన్నాయి. అయితే బాలీవుడ్‌లో కలిసి వచ్చి ఈమె అక్కడ స్టార్ అయ్యింది.



మరింత సమాచారం తెలుసుకోండి: