‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన రాజమౌళి తీయబోయే మల్టీ స్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపధ్యంలో ఈమూవీ కథ విషయంలో రాజమౌళి టెన్షన్ రోజురోజుకీ పెరిగి పోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. జూనియర్ రామ్ చరణ్ లు అన్నదమ్ములుగా నటించబోతున్న ఈమూవీ కథలో వీరిద్దరు బాక్సర్స్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. 
Ram Charan, SS Rajamouli, and Jr. NTR
ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన అనేక వార్తలు హడావిడి చేసిన నేపధ్యంలో దీనికి కొనసాగింపుగా మరో లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. ఈసినిమాకు సంబంధించి స్టోరీ లైన్ ఫైనల్ అయినప్పటికీ ఈమూవీ పూర్తి స్క్రిప్ట్ విషయంలో రాజమౌళి పూర్తిగా సంతృప్తి చెందకపోవడంతో ఇప్పటి వరకు ఆరు సార్లు ఈ మూవీ స్క్రిప్ట్ ను డ్రాప్ట్ చేసినట్లు తెలుస్తోంది. 
DVV Danayya Rs 250 Crores Budget For #RRR Movie
తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి ఈమూవీకి సంబంధించిన ఆరవ డ్రాప్ట్ ను కూడ తిరస్కరించినట్లు టాక్. దీనికి కారణం ఈమూవీ కథకు సంబంధించిన ప్రీ క్లైమాక్స్ విషయంలో విజయేంద్ర ప్రసాద్ రైటర్స్ టీమ్ రాజమౌళిని పూర్తిగా సంతృప్తి పరచలేకపోయింది అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనితో విజయేంద్ర ప్రసాద్ టీమ్ మరొకసారి రాజమౌళి చెప్పిన విధంగా ప్రీ క్లైమాక్స్ ను డిజైన్ చేస్తూ ఏడవసారి ఫైనల్ స్క్రిప్ట్ రాయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

గతంలో రాజమౌళి ‘విక్రమార్కుడు’ ‘యమదొంగ’ లాంటి సినిమాలకు డైలాగ్స్ వ్రాసిన డైలాగ్ రైటర్ రత్నం తిరిగి రాజమౌళి టీమ్ లో చేరి ఈమూవీ కోసం భారీ పవర్ ఫుల్ డైలాగ్స్ వ్రాస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి అడిగితే చాలు ఎంతటి పెద్ద ఆర్టిస్ట్ అయినా తమ డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా కథ విషయంలో రాజమౌళి పడుతున్న అయోమయం వల్ల ఈమూవీ షూటింగ్ మరో కొన్ని నెలలు వాయిదా పడి డిసెంబర్ కు చేరినా ఆశ్చర్య పడనవసరం లేదు అని అంటున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: