‘అజ్ఞాతవాసి’ షాక్ నుండి తేరుకుని త్రివిక్రమ్ తీస్తున్న ‘అరవింద సమేత’ షూటింగ్ చాల వేగంగా జరుగుతోంది. ఎంతో అవసరం అయితే తప్ప ఈమూవీ షూటింగ్ కు ఎక్కడా బ్రేక్ పడటం లేదు. దీనితో అనుకున్న ప్రకారం ఈసినిమా పూర్తి అవుతున్న నేపధ్యంలో ఈమూవీ రిలీజ్ డేట్ పై త్రివిక్రమ్ దృష్టి పెట్టినట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీని అక్టోబర్ 10 లేదంటే 11న విడుదల చేయాలి అన్న పట్టుదలలో త్రివిక్రమ్ ఉన్నట్లు టాక్. 
Aravinda Sametha Veera Raghava First Look Motion Teaser - Sakshi
అయితే ఈ రెండు తేదీలు సినిమాల విడుదలకు పనికి వచ్చే శుక్రు వారాలు కావు. ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 10 బుధ వారం నుండి ప్రారంభం అవుతున్న నేపధ్యంలో సెంటిమెంట్ గా ‘అరవింద సమేత’ ను బుధ వారం అయినప్పటికీ అక్టోబర్ 10న విడుదల చేయాలని త్రివిక్రమ్ ముహూర్తం నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఈసినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ వదిలిన నేపధ్యంలో ఈమూవీ టీజర్ ను ఆగష్టు 15న విడుదల చేయడానికి త్రివిక్రమ్ మరొక ముహూర్తం ఫిక్స్ చేసినట్లు టాక్. 
NTR
అదేవిధంగా ఈమూవీ ఆడియో ఫంక్షన్ సెప్టెంబర్ రెండవ వారంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ సెప్టెంబర్ నెలాఖరున అత్యంత భారీ స్థాయిలో చేయడానికి ఇప్పటి నుంచే త్రివిక్రమ్ ప్లాన్స్ వేస్తున్నట్లు సమాచారం. ఇక ‘అరవింద సమేత వీరరాఘవ’ కు ఈమధ్య కాలంలో ఎసినిమాకు దక్కని ఒక విశేష అదృష్టం ఊహించని విధంగా దక్కింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘మహానటి’ తరువాత నుంచి జనాలను కిర్రెక్కించే సినిమా ఇప్పటిదాకా రాలేదు. దసరాలోపు అలాంటి సినిమా వస్తుందని అంచనాలు కూడా ఫిలిం ఇండస్ట్రీలో లేవు. 
Time fix for NTR first look
‘రంగస్థలం’ సినిమా విడుదలకు ముందు దాదాపు కొన్నినెలల పాటు ఒక మంచి సినిమా లేక తెలుగు ప్రేక్షకులు అల్లాడిపోయిన విధంగా సమ్మర్ తరువాత వస్తున్న సినిమాలు అన్నీ అంతంతమాత్రంగానే మారుతున్న నేపధ్యంలో ఒక భారీ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి గ్యాప్ లో వస్తున్న మూవీ ‘అరవింద సమేత’ ‘రంగస్థలం’ మూవీకి గతంలో ఇలాంటి గ్యాప్ ఎలాంటి అదృష్టం ఇచ్చిందో ఇప్పుడు జూనియర్ త్రివిక్రమ్ ల మూవీకి కూడ అటువంటి అదృష్టమే పట్టబోతోంది అన్న ప్రచారం జరుగుతోంది. దీనితో ఈమూవీని బయ్యర్లు విపరీతమైన రేట్లకు కొంటున్నారు. మరి త్రివిక్రమ్ ముహూర్తాలు ‘అరవింద సమేత’ ను ఎంత వరకు రక్షిస్తాయో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: