వరస పరాజయాలతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ కష్టాలు తీరాలి అంటే ఎవరైనా ఒక టాప్ హీరోతో సినిమా చేయడమే పరిష్కారం అన్న కామెంట్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే పూరి పేరు చెపితే సీనియర్ టాప్ హీరోల నుండి యంగ్ టాప్ హీరోల వరకు పారిపోతున్న పరిస్థుతులలో ఎట్టకేలకు పూరీకి నాగార్జున కథ వినడానికి సమయం ఇవ్వడం షాకింగ్ న్యూస్ గా మారింది. 
Nagarjuna In Puri Jagannath Auto Jhony - Sakshi
తెలుస్తున్న సమాచారం మేరకు పూరి కొన్ని రోజుల క్రితం నాగార్జునను కలిసి నాగ్ కు సరిపోయే ఒక కథ నాగచైతన్యకు సరిపోయే మరొక కథ వినిపించినట్లు టాక్. ఈ రెండు కథలు నాగార్జునకు బాగా నచ్చినా ఈ కథలను నిర్మించబోయే నిర్మాణ సంస్థలు ఎవరు అని ప్రశ్నించినట్లు వార్తలు వస్తున్నాయి. 
Puri Jagannath shocking comments
అంతేకాదు ఈ కథలను పూరి తన సొంత బ్యానర్ లో నిర్మించడం తనకు ఇష్టంలేదని అందువల్ల ఈకథలు నచ్చి ఏప్రముఖ నిర్మాణ సంస్థ అయినా ముందుకు వస్తే అప్పుడు వీటి గురించి ఆలోచిస్తాను అంటూ నాగ్ పూరీతో చెప్పినట్లు సమాచారం. లేటెస్ట్ గా రామ్ గోపాల్ వర్మ సొంత బ్యానర్ లో నాగార్జునతో తీసిన ‘ఆఫీసర్’ పరాజయం చెందడంతో పాటు కనీసపు క్వాలిటీ కూడ ఆసినిమాలో కనిపించలేదు అని కామెంట్స్ వచ్చిన నేపధ్యంలో నాగ్ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు.
Purijagannadh.jpg
ప్రస్తుతం పూరీకి ఉన్న ఫెయిల్యూర్ ఇమేజ్ రీత్యా ఏప్రముఖ నిర్మాణ సంస్థ ముందుకురాని పరిస్థుతులలో నాగార్జున కండిషన్స్ ను తీర్చగల శక్తి పూరీకి లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ఇలా ప్రముఖ హీరోల చుట్టూ తిరిగి కాలం వృథా చేసుకునేకన్నా తన కొడుకు ఆకాష్ తోనే మరో సినిమాను తీసి హిట్ కొట్టి తన సత్తాను చాటాలి అన్న ఆలోచనలలో పూరి ఉన్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: