పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చి జనసేన కార్యచరణ మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆంధ్రాలో ప్రజా పోరాట యాత్రలో బిజీగా ఉన్న పవన్ చంద్రబాబు ప్రభుత్వ పనితీరుని విమర్శిస్తూ రోజుకో సంచలనం సృష్టిస్తున్నారు. మరోపక్క పవన్ కు సపోర్ట్ గా నిలుస్తున్న ఆర్టిస్టుల లిస్ట్ పెద్దదవుతుంది. 


జబర్దస్త్ షోలో ఈమధ్య బాగా పాపులారిటీ తెచ్చుకున్న హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. కత్తి మహేష్, పవన్ ఫ్యాన్స్ ఇష్యూలో కూడా ఆది కలుగ చేసుకుని పవన్ కళ్యాణ్ కు ఆయన ఫ్యాన్స్ కు సపోర్ట్ ఇస్తూ కత్తిపై కామెంట్స్ చేస్తూ తన స్కిట్స్ లో కూడా సుత్తి రాజేష్ అంటూ కామెంట్ చేశాడు.


ఇక పవన్ ఛాన్స్ ఇస్తే జనసేన తరపున ప్రచారం చేసేందుకు కూడా సిద్ధమే అంటున్నాడు ఆది. అదే విషయాన్ని పవన్ ను కలిసి చెప్పాడట. పార్టీలో చేరేప్పుడు అన్ని ఆలోచించుకోవాలని సూచించాడట పవన్. దానికి సిద్ధమైతే ఎప్పుడైనా రావొచ్చని ఆహ్వానించాడట. సో ఆది జనసేనలో చేరడం అనివార్యమని చెప్పొచ్చు. 


అయితే ఆది చేరడమే కాదు జనసేన ప్రచారంలో తన పెన్ పవర్ ను వాడేస్తాడని అంటున్నారు. జనసేన తరపున ప్రచారంలో భాగంగా ఆది కొన్ని కొటేషన్స్ ప్రిపేర్ చేస్తున్నాడట. జబర్దస్త్ లో పంచులే కాదు ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల మీద కూడా కొటేషన్స్ రాసేందుకు సిద్ధమవుతున్నాడట ఆది. మరి జనసేన కోసం హైపర్ ఆది పెన్ పవర్ ఏవిధంగా ఉపయోగపడుతుందో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: