తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు యంగ్ హీరోల హవా నడుస్తుంది.  స్టార్ హీరోలు ఒకటీ రెండు చిత్రాలు రిలీజ్ అవుతుంటే..యంగ్ హీరోల చిత్రాలు వరుసగా వస్తున్నాయి. తాజాగా ఇండస్ట్రీలో కర్మ చిత్రంతో దర్శకుడు, హీరోగా పరిచయం అయిన అడవి శేషు తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వస్తున్నాడు. నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో అడివి శేష్ , శోభిత దూళిపాళ్ల జంటగా నటించిన చిత్రం ‘గూఢచారి’.

ఈ చిత్ర టీజర్ ఈ రోజు ప్రముఖ హీరోయిన్ సమంత అక్కినేని చేతులమీదకు విడుదలైన విషయం తెలిసిందే. టీజర్లో వాడిన సాంకేతికతను, విజువల్స్ ను చూస్తే అభిషేక్ పిక్చర్స్ సినిమాను పెద్ద స్థాయిలోనే నిర్మించినట్టు తెలుస్తోంది. ఒక రా ఏజెంట్ కథగా ఉండబోతున్న ఈ స్పై థ్రిల్లర్ ను చూస్తే అడివి శేష్ ఖాతాలో హిట్ ఖాయమనే నమ్మకం కలుగుతోంది. ఇక చాలా కాలం తరువాత సుప్రియ ఈ సినిమా ద్వారా తెలుగులోకి మళ్ళి రీ ఎంట్రీ ఇచ్చారు.

ఈ చిత్రంలో ఆమె ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు . శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నా ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

అమెరికాతో పాటు సినిమా అస్సామ్, మేఘాలయ, ఢిల్లీ, బంగ్లాదేశ్ వంటి ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జరిగింది. అక్కినేని సుప్రియ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తోంది. ఆగష్టు 3వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: