తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ చిత్రాల్లో తన నటనతో టాప్ హీరోయిన్ రేంజ్ కి చేరిన నటి నిషా కళ్ల సుందరి త్రిష.  తన పర్సనల్ లైఫ్ లో ఎన్ని వివాదాలు ఉన్నా ఈ అమ్మడి కెరీర్ పరంగా మాత్రం టాప్ లో ఉంటూ వస్తుంది.  ఇప్పటికీ త్రిషా అందాలు కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.  దాదాపు ద‌శాబ్దంపాటు స్టార్ హీరోయిన్‌గా చెలామ‌ణి అయింది చెన్నై చిన్న‌ది త్రిష‌.
Image result for Trisha bungee jump  Canada
ఇప్ప‌టికీ ప‌లు సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. హార‌ర్ సినిమాల్లోనూ, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ త్రిష అవ‌కాశాలు దక్కించుకుంటోంది.  త్రిష కెరీర్ పరంగానే కాదు స్వతహాగా ఎంతో ధైర్య సాహాసాలు కలిగిన హీరోయిన్.  తన జీవితంలో ఎన్ని వడిదుడుకులు వచ్చినా..ఏ మాత్రం కృంగి పోకుండా నటిస్తూ నెంబర్ వన్ రేస్ లో నిలిచింది. 

తాజాగా ఈ అమ్మడు కెన‌డాలో బంగీ జంప్ చేసింది.కెన‌డాలోని ఓ బేస్‌బాల్ స్టేడియంకు 1168 అడుగుల ఎత్తులో త్రిష ఈ సాహ‌సం చేసింది. `1168 అడుగుల దిగువ‌న జ‌రుగుతున్న బేస్‌బాల్ మ్యాచ్‌ను 10 నిమిషాల‌పాటు చూడ‌డం చాలా గొప్ప అనుభూతి ` అంటూ త్రిష్ ట్వీట్ చేసింది.  కాగా, తాను బంగీ జంప్ చేస్తున్న ఫోటోల‌ను ట్విట‌ర్ ద్వారా త్రిష పంచుకుంది. సాటి క‌థానాయిక‌లు కూడా త్రిష సాహ‌సాన్ని అభినందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: