టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్ ఎస్ రాజమౌళి తీసిన సినిమా బాహుబలి, బాహుబలి2.  ఈ సినిమాల కోసం ఆయన ఐదు సంవత్సరాలు పట్టుదలతో పూర్తి చేశారు.  అందుకోసం హీరో ప్రభాస్ కూడా సహకరించడంతో ఈ సినిమా అనుకున్నదానికన్నా ఎన్నో రెట్లు విజయం సాధించింది.  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కనీ వినీ ఎరుగని రీతిలో గుర్తింపు వచ్చింది.  బాహుబలి2 ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది.  దేశంలో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాగా బాహుబలి రికార్డు సాధించింది. 
Image result for బాహుబలి ప్రీక్వెల్
అయితే అంత గొప్ప సినిమా మళ్లీ తెరపైకి వస్తుందా అంటే డౌట్ అనే అంటున్నారు సినీ విశ్లేషకులు.  తెలుగు సినిమా ఖ్యాతిని అంత‌ర్జాతీయ స్థాయికి చేర్చిన సినిమా `బాహుబ‌లి`. రెండు భాగాలుగా విడుద‌లైన‌ `బాహుబ‌లి` సినిమాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.  ఇదే కోవ‌లో త్వ‌ర‌లో మ‌రో `బాహుబ‌లి` రాబోతోంది. అయితే ఇది సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్‌. `బాహుబ‌లి-1`కి ముందు జ‌రిగిన విష‌యాలు.. అంటే శివ‌గామి శ‌కం గురించి అన్న‌మాట‌.

ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాకు ప్రీక్వెల్ నిర్మించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రీక్వెల్ వెబ్ సిరీస్ రూపంలో ఉంటుందట. ఇందుకోసం దాద‌పు 375 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ కేటాయించింది.  మొత్తం మూడు సీజన్లుగా ఉండనున్న ఈ సిరీస్ ను రాజమౌళి, దేవ కట్టలు డైరెక్ట్ చేయనున్నారు.
Image result for బాహుబలి ప్రీక్వెల్
బాహుబలి కథలో రమ్యకృష్ణ ధరించిన శివగామి పాత్ర నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ఉండనుంది. ఇందులో ఒక్కొక్క ఎపిసోడ్ కు రూ.7 కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నారట.  ఈ సిరీస్‌ను రాజ‌మౌళి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప్రముఖ ద‌ర్శ‌కుడు దేవ్ క‌ట్టా తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ వెబ్ సిరీస్ కోసం న‌టీన‌టుల ఎంపిక‌లో దేవ్‌క‌ట్టా బిజీగా ఉన్నాడ‌ని స‌మాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: