ఇప్పడు చాలా మంది దర్శకులు తెలుగు లో డీవీడీ ని ఫాలో అవుతున్నట్టున్నారు. ఎదో ఒక సినిమా చూసి అందులో ఎదో ఓకే పాయింట్ పట్టుకొని తెలుగు సినిమా కు తగ్గట్టుగా మార్చి మళ్ళీ పాత సినిమా నే వండి వడ్డిస్తున్నారు. అందుకే సినిమా రిజల్ట్ విషయం లో తేడా వస్తుంటుంది. ఇప్పడు కూడా ఏకంగా మూడు సినిమా లు ఒకే లైన్ మీద నిర్మిస్తున్నట్టు బోగట్టా...!  ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న గుసగుసలు నిజమైతే, నిర్మాణంలో వున్న మూడు సినిమాలకు ఒకటే లైన్ ఆధారం అని తెలుస్తోంది.

Image result for nani, naga chaitanya

నాని-గౌతమ్ తిన్ననూరి (మళ్లీరావా) కాంబినేషన్ లో తయారవుతున్న జెర్సీ, విజయ్ దేవరకొండ-భరత్ కమ్మ కాంబినేషన్ లో ప్రారంభమైన డియర్ కామ్రేడ్, నాగ్ చైతన్య-శివనిర్వాణ కాంబినేషన్ లో ప్రారంభం కాబోయే సినిమా. ఈ మూడింటికి క్రికెట్ తో టచ్ వుంటుదని తెలుస్తోంది. నాని జెర్సీ సినిమా ఇప్పటికే క్రికెట్ బ్యాక్ డ్రాప్ అని చెప్పేసారు. ఇక మిగిలిన రెండింటి సంగతి తెలియాలి.

Image result for nani, naga chaitanya

చైతన్య సినిమాలో పెళ్లికి ముందు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా క్రికెట్ టచ్ తో సాగుతుందని తెలుస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ లో కాలేజీలో రాజకీయాలతో పాటు, క్రికెట్ వ్యవహారాలు వుంటాయని వినికిడి. మొత్తానికి ఈ మూడింటికి ఎక్క...డో... ఏదో ఇన్సిపిరేషన్ దొరికింది అనుకోవాలి. కానీ ఎవరి సినిమా ముందువస్తే దానికే కిక్కు వుంటుంది. ఆ విషయంలో డియర్ కామ్రేడ్ కే ఎక్కువ చాన్స్ వుంది. ఎందుకంటే చైతన్య సినిమా ఆగస్టు 1న స్టార్ట్ అవుతుంది. నాని సినిమా సెట్ మీదకు వెళ్లడానికి టైమ్ పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: