భారతీయ చరిత్రలో రామాయణం, మహాభారత ఇతిహాసాలు ఎంతో గొప్ప ప్రాచుర్యం పొందాయి.  అంతే కాదు భారతీయ చలన చిత్ర రంగంలో రామాయణం, మహాభారతానికి సంబంధించి ఎన్నో చిత్రాలు, టీవి సీరియల్స్ వచ్చాయి. ఇక  రామాయణం పేరు వినగానే రామ, సీత, రావణుడితోపాటు గుర్తొచ్చే మరో పేరు శూర్పణక.   
Related image
ఒక రకంగా చెప్పాలంటే..రామాయణంలో శూర్పణఖ కీలకం అంటారు..ఆమె కు జరిగిన పరాభవంతో రావణాసురిడి వరకు వెళ్లి మొరపెట్టుకోవడంతో సీతాపహరణకు ప్రధాన కారణం. తాజాగా తమిళ ద‌ర్శ‌కుడు బార్గ‌వ్ శూర్పణఖ పాత్రను స్ఫూర్తిగా తీసుకుని క‌థ‌ను రూపొందించాడు. ఈ క‌థ‌ను ఇటీవ‌లే కాజ‌ల్ ను ఆయ‌న వినిపించ‌డం వెంట‌నే ఓకే చెప్పేయ‌డం జ‌రిగింది…తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా చేయడానికి భార్గవ్ సన్నాహాలు మొదలుపెట్టేశాడు.   
Image result for kajal aggarwal
కాజల్ అందమైన శూర్పణఖలా కనిపించనుందట. రూపం అందంగా ఉన్నప్పటికీ.. స్వభావం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సోషియో ఫాంటసీ డ్రామాను తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారట భార్గవ్. పాత్ర కాజల్‌కు కూడా బాగా నచ్చిందట. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే సినిమా స్టార్ట్ చేస్తారని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: