‘బిగ్ బాస్ 2’ షోను నాని సరిగ్గా హోస్ట్ చేయలేకపోతున్నాడు అన్న విమర్శలు విపరీతంగా పెరిగిపోవడంతో నానీని ఈషో నుండి తప్పిస్తారా అన్న అనుమానాలు కూడ చాలామందికి వచ్చాయి. అయితే ఇలాంటి రూమర్స్ కు చెక్ పెట్టె ఉద్దేశ్యంలో స్టార్ మా యాజమాన్యం స్వయంగా రంగంలోకి దిగి నానీ వల్ల ‘బిగ్ బాస్ 2’ లాభాలు పెరిగాయి అంటూ మీడియాకు లీకులు ఇస్తోంది. 
bigg boss 2 telugu hosted by nani
స్టార్ మా సౌత్ బిజినెస్ హెడ్ అశోక్ జైన్ ఇస్తున్న లీకుల ప్రకారం ‘బిగ్ బాస్ 2’ షోకు రేటింగ్స్ తగ్గినా లాభాలు నాలుగు రెట్లు పెరిగాయి అని అంటున్నారు. గతంలో జూనియర్ హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్’ సీజన్ వన్ కు 16.2 టిఆర్‌పి రేటింగ్ వస్తే నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా చేస్తున్న ‘బిగ్‌బాస్‌’ సీజన్2కి టిఆర్‌పి రేటింగ్‌ లో కొద్దిగా తగ్గినా దాని వల్ల తమకు ఎటువంటి నష్టం జరగలేదనీ అంటూ ఈ కార్యక్రమం వల్ల తమ లాభాలు నాలుగురెట్లు పెరిగాయి అని స్టార్ మా యాజమాన్యం అభిప్రాయ పడుతోంది. 
Bigg Boss Season II
‘బిహ్ బాస్’ సీజన్ 1 టెలికాస్ట్ టైమ్ ప్రతిరోజు రాత్రి రెండు గంటలు ఉంటే ‘బిగ్ బాస్ 2’ టెలికాస్ట్ టైమ్ ను రెండున్నర గంటలకు పెంచడంతో రేటింగ్స్ తగ్గాయి కానీ అది నాని హోస్టింగ్ లోపం వల్ల కాదు అంటూ నానీకి వత్తాసు పలుకుతూ స్టార్ మా యాజమాన్యం రంగంలోకి దిగింది. అంతేకాదు ‘బిగ్‌బాస్‌2’ రేటింగ్ తగ్గినా ఈ షోకు వచ్చిన ప్రకటనల ఆదాయం వల్ల లాభాలు నాలుగు రెట్లు పెరిగాయి అని అంటున్నారు అశోక్ జైన్. 
Nani tak es upon the host’s duty for Bigg Boss 2 Telugu in the new season.
అయితే అంకెల్లో ఎంత లాభం పెరిగిందో తాను చెప్పలేకపోయినా ‘బిగ్ బాస్ 2’ బిజినెస్ పరంగా సూపర్ సక్సస్ అని సంకేతాలు ఇస్తోంది స్టార్ మా యాజమాన్యం. నానీ పై పెరుగుతున్న విమర్శకుల దాడిని వ్యూహాత్మకంగా స్టార్ మా యాజమాన్యం తప్పి కొడుతున్న నేపధ్యంలో ఇక ఈవారంతంలో ప్రసారం అయ్యే ఎలిమినేషన్ ఎపిసోడ్ లో ఇక నాని రెచ్చిపోతాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: