ఐదు వరస పరాజయాల తరువాత సాయి ధరమ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ‘తేజ్ ఐ లవ్యూ’ ఓవర్సీస్ టాక్ ఏమాత్రం ఆసాజనకంగా లేదు అన్న ప్రాధమిక వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించిన ఓవర్సీస్ మొదటి షోలను చూసిన మెగా అభిమానులు కూడ ఈసినిమా పట్ల పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది. 
five reasons to watch sai dharms tej i love you movie
ఈమూవీ చూసిన కొందరు ఓవర్సీస్ ప్రేక్షకులు ఇస్తున్న లీకుల ప్రకారం సాయిధరమ్ తేజ్ నుంచి మరోకసారి నిరాశను కలిగించే చిత్రంగా ఈమూవీ ఉందని తేజ్ ఇలాంటి కథలను ఎందుకు ఎంచుకుంటున్నాడో అర్ధం కావడం లేదు అని కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో కొందరైతే   15 ఏళ్ల నాటి కాలం చెల్లిన కథ కథనాలతో కరుణాకరన్ నిరాశపరిచాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
teju i love u
మొత్తంగా చూస్తే సాయిధరమ్ తేజ్ కు మరో పరాజయం తప్పేలా లేదు అంటూ మరికొందరు అంచనాలు వేస్తున్నారు. ఓవర్సీస్ లోని మెగా అభిమానుల సైతం . సాయిధరమ్ తేజ్ తన కెరీర్ లో బ్యాడ్ ఫేజ్ కంటిన్యూ అవుతోంది అంటూ టాలీవుడ్ లో ఏం జరుగుతోంది వరుసగా నిరాశకలిగించే చిత్రాలు వస్తున్నాయి అంటూ విమర్శలు చేస్తున్నారు. 
sai-dharam-tej-karunakaran-k-s-rama-rao-movie-update
మరికొందరు అభిమానులు మరో అడుగు ముందుకు వేసి ఈసినిమాలో ఎవరేజ్ మూవీగా మారబోతున్న నేపధ్యంలో తేజ్ తన నెక్స్ట్ మూవీ పైనే ఆశలు పెట్టుకోవాలని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి అభిప్రాయాలే మన తెలుగు రాష్ట్రాలలోని సినిమా ప్రేక్షకులు వ్యక్తపరిస్తే తేజ్ కు ఇది వరస 6వ పరాజయంగా మారి మెగా మేనల్లుడుని పీకలలోతు కష్టాలలోకి తోసివేయడం ఖాయం. అయితే అసలు ఫలితం తెలియడానికి మరి కొన్ని గంటలు పట్టే అవకాసం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: