పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ట్విట్టర్ అకౌంటును కేవలం తన రాజకీయా ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుంటూ తన ప్రత్యర్ధులను దాడిచేసే అస్త్రంగా మార్చుకున్నాడు. సాధారణంగా పవన్ తన వ్యక్తిగత విషయాలు ఓపెన్ గా తన అభిమానులతో పంచుకోడు.
తెలివి తక్కువగా, అనాలోచితంగా కాదు
దీనికి విరుద్ధంగా పవన్ అందరికీ షాక్ ఇస్తూ తాను 7వ క్లాసు చదువుతున్నప్పుడు తన అన్న చిరంజీవితో తీయించుకున్న ఒక అరుదైన ఫోటోను సోషల్ మీడియాలో లీక్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఈఫోటోలో పవన్ తన అన్నలు చిరంజీవి నాగ బాబులతో పాటు తన అక్కలతో కలిసి కనిపిస్తున్నాడు. ఈఫోటో సుమారు 4 దశాబ్దాల క్రితం తీయించుకున్న ఫోటో అని పవన్ చెపుతున్నాడు. 

 మా ఇంట్లో వారు కూడా అర్థం చేసుకోలేదు, వారికి మాత్రమే అర్థమయ్యాను..

అయితే ఈఫోటోలో పవన్ నీరసంగా కనిపించడానికి ఒక కారణం ఉంది అని స్వయంగా చెపుతున్నాడు పవన్. అప్పటికే దీర్ఘ కాలిక శ్వాస కోస వ్యాధితో తాను బాథపడుతున్న విషయాన్ని వివరిస్తూ అందువల్లనే తాను ఈఫోటోలో నీరసంగా కనిపిస్తున్న విషయాన్ని వివరించాడు.  ఇప్పుడు ఈఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి వేలాది పవన్ అభిమానుల మధ్య షేర్ అవుతోంది. గత కొంత కాలంగా పవన్ చిరంజీవితో తన సాన్నిహిత్యాన్ని మళ్ళీ ఓపెన్ గా చెప్పడం ప్రారంభించి తమ అన్నదమ్ములు అంతా ఒక్కటే అన్న సంకేతాలు ఇస్తున్నాడు. 

Pawan Kalyan posts photo with his brothers and sisters
దీనికి స్పందనగా చిరంజీవి కూడ తన అభిమాన సంఘాల నాయకులను అదేవిధంగా వేల సంఖ్యలో ఉన్న చిరంజీవి అభిమానులను ‘జనసేన’ పార్టీ కార్యకర్తలుగా మారుస్తూ భవిష్యత్ ఎన్నికల రణరంగంలో తాను వెనక ఉండి పవన్ ను నడిపించబోతున్నాను అన్న స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాడు. ఏమైనా మరొకసారి బయటపెట్టుకున్న మెగా బంధం ఈనాటి హాట్ టాపిక్..



మరింత సమాచారం తెలుసుకోండి: