మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ రేయ్ సినిమా ముందు సెట్స్ మీదకు వెళ్లినా పిల్లా నువ్వు లేని జీవితం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా ఫ్యామిలీ హీరోగా ఆ సినిమాలో జోష్ కనబరచిన తేజూ ఆ తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్ కూడా మంచి ఫలితాన్నే అందుకుంది. ఇక సాయి ధరం తేజ్ ను హీరోగా నిలబెట్టిన సినిమా సుప్రీం.


ఆ సినిమాతో అతనికి సుప్రీం హీరో అన్న స్క్రీన్ నేం కూడా పెట్టేశారు. అక్కడ నుండి మొదలైన తేజూ ఫ్లాప్ సినిమాల హంగామా.  తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్ ఇలా ఐదు వరుస ఫ్లాపులతో కెరియర్ సంక్షోభంలో పడేసుకున్న తేజూ ప్రస్తుతం కరుణాకరణ్ డైరక్షన్ లో వస్తున్న తేజ్ ఐలవ్యూ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు.  


ఇది కేవలం తేజూకి మాత్రమే కాదు దర్శకుడు కరుణాకరణ్ కు హిట్ కొట్టాల్సిన సినిమా. తేజ్ ఐలవ్యూ ప్రీమియర్స్ తో వస్తున్న టాక్ చూస్తే తేజూకి మళ్లీ ఈ సినిమా కూడా నిరాశ కలిగించిందని తెలుస్తుంది. కథల విషయంలో తనదే ఫైనల్ డెశిషన్ అయినా తేజూ కెరియర్ ఇలా మారడానికి తానే కారణమని అంటున్నారు. కాస్త తనమీద తనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఈ ఫ్లాపులకు కారణమని తెలుస్తుంది.


అయితే ఇకనుండైనా మెగా హీరోల సపోర్ట్ తీసుకుని ఎలాంటి కథలు చేస్తే హిట్ కొడతామో చర్చించి సినిమాలు చేస్తే బెటర్ లేదంటే సుప్రీం హీరోగా వచ్చిన క్రేజ్ అంతా తగ్గిపోయే అవకాశం ఉంది. ఓ పక్క వరుణ్ తేజ్ మాత్రం సినిమా సినిమాకు సంబంధం లేకుండా కొత్త ప్రయోగాలతో ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: