బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పటికీ బ్యాచ్ లర్ జీవితాన్నే గడుపుతున్నాడు.  గతంలో ఆయన ఐశ్వర్య రాయ్‌, కత్రినా కైఫ్‌, సంగీత బిజ్‌లానీలతో డేటింగ్‌ చేసినట్లు  ఎన్నో వార్తలు వచ్చాయి.  అయితే తన సహనటులకు పెళ్లిళ్లు జరిగాయి..వారి పిల్లలు త్వరలో ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.  కానీ సల్మాన్ మాత్రం తన పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు ఓ డేట్ చెప్పడం..అది దాటివేయం కామన్ అయ్యింది. 
Image result for salman khan
అయితే సల్మాన్ ఖాన్ కెరీర్ బిగినింగ్ లో తాను నటి జూహీచావ్లాను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కానీ జూహీ తండ్రి ఇందుకు ఒప్పుకోలేదని అంటున్నారు. ఈ విషయాన్ని సల్మాన్‌ 1992లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.  అప్పట్లో నా కన్నా అమీర్ ఖాన్ కే మంచి క్రేజ్ ఉండేది..అందుకే మేమిద్దరం కలిసి నటించిన ‘అందాజ్‌ అప్నా అప్నా’ను  చిత్రాన్ని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయించాం. 

ఆ సినిమాలో నా కన్నా ఎక్కువ అమీర్ రోల్ కే మంచి క్రేజ్ వస్తుంది..అప్పడు అందరూ అతనికే ఫిదా అవుతారని భయపడ్డాను.  ఇక ఆమీర్ ఖాన్ ప్పుడూ తన భార్య గురించి చెప్తూనే ఉండేవాడు. దాంతో నాకూ పెళ్లి చేసుకోవాలని, నాకంటూ ఓ కుటుంబం ఉండాలని అనిపించేది. నేను జూహీ చావ్లాను పెళ్లిచేసుకుందామని అనుకున్నాను. 
Related image
ఈ విషయాన్ని జూహి తండ్రి వద్ద ప్రస్తావిస్తే..ఆయన అంగీకరించలేదు..పైగా నేను తన అల్లుడి హోదాలో సరిపోనని చెప్పాడు..అలా ఎందుకు చెప్పాడో నాకు అర్ధం కాలేదని వాపోయాడు. ఈ ఇంటర్వ్యూ ఇచ్చే సమయానికి సల్మాన్ మంచి వయసులో ఉన్నాడు..మరి పెళ్లి విషయాన్ని సీరియస్ గా అన్నాడో..కామెడీగా అన్నాడో ఆయనకే తెలియాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: