తమిళ భాషలో అగ్ర హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కొలమావు కోకిల.  గత కొంత కాలంగా నయనతార లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తుంది.  కొన్ని నెలల కిందట విడుదలైన ‘కర్తవ్యం’ సినిమాలో నయనతార నటన ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ఆ చిత్రం తమిళంలో చాలా పెద్ద హిట్టయ్యింది.  అంతకుముందు ‘మయూరి’ అనే హర్రర్ మూవీలోనూ అదరగొట్టింది. తాజాగా ఆమె ‘కోలమావు కోకిల’ అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది.  ఇక ట్రైలర్ చూస్తుంటే నయనతార ఈ చిత్రంలో స్మగ్లర్ గా నటిస్తున్నారని తెలుస్తుంది.

వైవిధ్యమైన కథాంశముతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అక్కట్టుకొనేలా వుంది. ఈ ట్రైలర్ కు తమిళనాట  అపూర్వ స్పందన వస్తోంది.  కథలో భాగంగా 25 కోట్ల విలువైన ఒక పౌడర్ ను నయన్ ఒక చోటు నుంచి మరో చోటికి చేర్చాలి. ఇందుకోసం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తుంటుంది. భయం భయంగా.. ఏమీ తెలియని అమాయకురాలిగా ఇందులో కనిపించింది.

ఆమెది పేద కుటుంబం. తల్లిదండ్రులు ఒక చెల్లెలు ఉంటారు. వాళ్లతో పాటు నయన్ ను ప్రేమించే ఒక కమెడియన్ కూడా వీళ్లతోనే ఉంటాడు. వీళ్లంతా కలిసి ఒక వ్యాన్ లో బయలు దేరుతారు.   

ఈ క్రమంలోనే వాళ్లకు ఎదురయ్యే సంఘటనల నేపథ్యంలోనే సినిమా సాగుతుంది. అయితే నయన్ ని చంపడానికి విలన్లు ప్రయత్నిస్తుంటారు..కానీ తన విశ్వరూపం చూపిస్తంది నయన్.  ట్రైలర్ చూస్తే సినిమా ఖచ్చితంగా హిట్టయ్యేలానే కనిపిస్తోంది. ట్రైలర్ కు ఇచ్చిన ఫినిషింగ్ టచ్ కూడా చాలా బాగుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: