సినిమాలలో కావచ్చు లేదంటే రాజకీయాలలో కావచ్చు ఒక వ్యక్తిని దెబ్బ కొట్టడానికి అతడి వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసుకుని బురద జల్లడం సర్వసాధారణ మైన విషయంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో రాబోతున్న ఎన్నికలలో కీలక శక్తిగా మారాలని ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దెబ్బతీయడానికి  రేణు దేశాయ్ ని ఒక పావుగా మార్చి ఆమె పేరు మీద సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ సృష్టించి పవన్ పై బురద జల్లుతున్న కార్యక్రమం వెనుక ఒక బలమైన అజ్ఞాతశక్తి ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అప్పుడు నన్ను తిడుతున్నా భరించమన్నారు
గత కొద్దిరోజులుగా కొందరు రేణు దేశాయ్ పేరుతో పవన్ పై అసభ్య పదాలతో ఆరోపణలు చేస్తూ క్రియేట్ చేస్తున్న ఫేక్ ప్రోఫైల్స్ పెరిగి పోతున్నాయి. రేణు దేశాయ్ కి పవన్ కు మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలను ఆసరాగా తీసుకుని పవన్ ను వ్యక్తిగతంగా దూషిస్తూ జరుగుతున్న ప్రచారం పై రేణు దేశాయ్ ఎట్టకేలకు స్పందించింది.  ఈ విషయాలు ఎవరు క్రియేట్ చేస్తున్నారో తనకు తెలియదని తన తప్పులేకున్నా తాను ఐదేళ్ళుగా నిందలు పడుతున్నానని బాధ పడింది రేణు దేశాయ్.
ఇలాంటి సమాజంలో ఉన్నందుకు బాధగా ఉంది
ప్రస్తుతం సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న తన ఫేక్ అకౌంట్స్ ను చూసి నిజంగానే తాను పవన్ కళ్యాణ్ ను తీవ్ర పదాలతో విమర్శించానని భావించి పవన్ అభిమానుల మాటల దాడితో తన ఇన్‌ స్టా‌గ్రామ్ అకౌంట్ నిండిపోయిందని అంటూ రేణు ఆవేదన వ్యక్త పరిచింది. అంతేకాదు ఈవ్యవహారం అంతా ఒక స్టుపిడ్ పొలిటికల్ పర్సన్ వీటిని సర్క్యులేట్ చేస్తున్నాడని అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. 
అపుడు మీకు నా ఆత్మాభిమానం ముఖ్యం అనిపించలేదా?
దీనితో ఆ స్టుపిడ్ పొలిటీషియన్ ఎవరు అన్న కోణంలో ఇప్పుడు లోతైన చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు ఇంతకాలం తన పై ఎందరో మాటల దాడిచేసినా పట్టించుకొని పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ పేరు ప్రతిష్టలకు భంగం కలిగితే తాను సరిచేయాలా అని రేణూ దేశాయ్ ప్రశ్నిస్తోంది. ఇలాంటి సమాజంలో జీవిస్తున్నందుకు తాను బాధ పడుతున్నానని అంటూ పవన్ గురించి తానెప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు అని ఆమె ఇచ్చిన క్లారిటీతో ఈ ఫేక్ కామెంట్స్ ఆగిపోతాయా లేదంటే మరో విధంగా రేణు దేశాయ్ పేరును వాడుకుంటూ పవన్ ను కార్నర్ చేసే స్కెచ్ ఇంకా మరింత బలంగా కొనసాగుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: