అందరూ ఊహించినట్లుగానే నాగార్జున నానీల మల్టీ స్టారర్ కు ‘దేవదాస్’ అన్న టైటిల్ ఫిక్స్ చేసి దీనికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసారు. అయితే అక్కినేని నాగేశ్వరావు క్లాసిక్ మూవీగా పేరు గాంచిన ‘దేవదాస్’ టైటిల్ ను తన సినిమాకు ఉపయోగించడం ఒక విధంగా నాగ్ చేస్తున్న సాహసం అంటూ అప్పుడే కొందరు విమర్శలు కూడ మొదలుపెట్టేశారు.
Nagarjuna, Nani
ఇది ఇలా ఉండగా ఈసినిమా కథకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈసినిమాలో నాగార్జున గ్యాంగ్ స్టర్ గా నాని డాక్టర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈమూవీ కథ గన్-స్టెటస్కోప్ ల మధ్య జరిగే వార్ గా ఈమూవీలో చూపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ కథలో అక్కడక్కడ చిరంజీవి గతంలో నటించిన ‘శంకర్ దాదా ఎమ్ బి బిఎస్’ ఛాయలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈమూవీలోని హాస్పటల్ సీన్స్ సెట్ అంతా ‘శంకర్ దాదా ఎమ్ బి బిఎస్’ మూవీ పోలికతో ఉంటుందని ముఖ్యంగా ఈసినిమాలోని హాస్పటల్ లో జరిగే హాస్య సన్నివేశాలను చూసే ప్రేక్షకులకు ఖచ్చితంగా చిరంజీవి ‘శంకర్ దాదా’ గుర్తుకు వస్తుందని అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 
Nani
ఇప్పుడు ఈవార్తలు ఇలా వైరల్ కావడంతో నాని నాగార్జునల ‘దేవదాస్’ లో మరొకసారి ప్రేక్షకులు ‘శంకర్ దాదా’ మూవీని చూడబోతున్నారా ? అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పరాజయాల బాటలో కొనసాగుతున్న నాగార్జున ‘కృష్ణార్జున యుద్ధం’ ఫెయిల్యూర్ తో షాక్ అయిన నానీలు కలిసి నటిస్తున్న ఈమూవీకి అక్కినేని క్లాసిక్ మూవీ టైటిల్ ఎంత వరకు సక్సస్ ను ఇస్తుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: