నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పాల్గొన్నారు. నందమూరి ఫ్యామిలీ సమక్షంలో కళ్యాణ్ రామ్ బర్త్ డే వేడుకలు జరిగాయి. అందులో భాగంగా ఎన్.టి.ఆర్, తన పెద్ద కొడుకు అభయ్ రామ్ కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు. ప్రస్తుతం వీటికి సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్ ల అన్నదమ్ముల అనుబంధం చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. అన్నకు ఎలాంటి అవసరం వచ్చినా తమ్ముడు.. తమ్ముడి ఏ ఆపద వచ్చినా అన్న తోడుగా ఉంటూ వస్తున్నాడు. ఇక ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పిక్స్ చూస్తే వారు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుస్తుంది.


ముఖ్యంగా ఎన్.టి.ఆర్ కొడుకు అభయ్ రామ్ ను చేతుల్లోకి తీసుకుని అతనితోని కేక్ కట్ చేయిస్తున్నట్టు కనబడుతున్న పిక్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఇక సినిమాల విషయానికొస్తే కళ్యాణ్ రామ్ ఇటీవల నటించిన నా నువ్వే డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం కె.వి గుహన్ డైరక్షన్ లో కళ్యాణ్ రామ్ సినిమా చేస్తున్నాడు.


ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. నివేదా థామస్, షాలిని పాండే ఈ సినిమాలో కళ్యాన్ రామ్ తో రొమాన్స్ చేస్తున్నారు. ఎన్.కే.ఆర్ 16 అంటూ ఫస్ట్ లుక్ తో వచ్చిన కళ్యాణ్ రామ్ చూస్తుంటే ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: