నిన్న మొన్నటి వరకు మెగా అభిమానులు వేరు పవన్ అభిమానులు వేరు అన్న గ్యాప్ కొనసాగింది. ఈ గ్యాప్ వల్ల ఒకానొక దశలో చిరంజీవి నాగబాబులు కూడ పవన్ అభిమానుల పట్ల అసహనాన్ని వ్యక్త పరిచిన సందర్భాలు గతంలో అనేకం జరిగాయి. అయితే ఇప్పుడు పవన్ రాజకీయాలలో తన స్పీడ్ ను పెంచిన నేపధ్యంలో చిరంజీవి అభిమాన సంఘ నాయకులు పవన్ ‘జనసేన’ లో సభ్యులుగా చేరుతున్న నేపధ్యంలో పవన్ వీరాభిమానులకు బయటకు చెప్పుకోలేని తీవ్ర అసంతృప్తి బయలుదేరింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
మురళీ మోహన్, అవంతిలకు హేళనగా ఉందా?
దీనికి కారణం లేటెస్ట్ గా పవన్ ‘జనసేన’ లో చిరంజీవి ఆల్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామినాయుడు ‘జనసేన’ పార్టీలో చేరడం పవన్ వీరాభిమానులకు ఊహించని షాక్ గా మారింది అని అంటున్నారు. స్వామినాయుడు పవన్ జనసేనలో చేరడంతో పాటు అనేకమంది పూర్వ ‘ప్రజారాజ్యం’ లోని ప్రముఖులు ‘జనసేన’ బాట పట్టడంతో ‘జనసేన’ ‘ప్రజారాజ్యం 2’ గా మారుతుందా అన్న భయాలు ప్రస్తుతం పవన్ అభిమానులను వెంటాడుతున్నట్లు టాక్. 
ఆవేశంగా పవన్ కళ్యాణ్
దీనికితోడు పవన్ వివిధ రాజకీయ పార్టీలలోని కాపు సామాజిక వర్గ నేతలకు ‘జనసేన’ ఆహ్వానాలు పంపుతున్న నేపధ్యంలో ఇప్పటి వరకు ‘జనసేన’ కోసం జెండాలు మోసిన కార్యకర్తలు పూర్తిగా సైడ్ లైన్ అయిపోతారా అన్న అనుమానాలు పవన్ అభిమానులలో అప్పుడే మొదలైపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికితోడు పవన్ తన ‘జనసేన’ సైనికులను ఒకొక్కరినీ రాబోతున్న ఎన్నికలలో 500 ఓట్లు వేయించండి అంటూ ఇస్తున్న టార్గెట్లు పవన్ అభిమానులను మరింత కలవర పెడుతున్నట్లు టాక్. 
ఆ ముక్తి ఎందుకు అనిపించింది
దీనికితోడు పవన్ ప్రస్తుతం తన పోరాట యాత్రలో కేవలం చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తూ మోడీ గురించి భారతీయ జనతా పార్టీ గురించి ఒక్క మాట కూడ మాట్లాడక పోవడం పవన్ వీరాభిమానులకు కూడ అర్ధం కాని విషయంగా మారింది అని అంటున్నారు. ఇలాంటి పరిస్థుతులలో పవన్ అభిమానుల మధ్య ఏర్పడుతున్న సందేహాలను అదేవిధంగా ఇప్పటికే ఏర్పడిపోయిన కొన్ని భయాలను గురించి పవన్ సరైన దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే పవన్ ను దేవుడుగా ఆరాధించే అతడి వీరాభిమానులలో వర్గాలు ఏర్పడి ఆ ఫ్యాన్ బేస్ నుండి వార్నింగ్ బెల్స్ మ్రోగే ఆస్కారం ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: