రకరకాల సమస్యల మధ్య సతమతమై చివరకు పట్టాలు ఎక్కిన ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు లీక్ అవుతున్నాయి. ఈసినిమా షూటింగ్ ప్రారంభం అయిన రోజునే ఎన్టీఆర్ మొట్టమొదటి సినిమా ‘మనదేశం’ అప్పట్లో చిత్రీకరణ ప్రారంభం అయింది. ఈమూవీ షూటింగ్ ప్రారంభం అయింది అని తెలియచేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో బాలకృష్ణ లుక్ అలనాటి ఎన్టీఆర్ లుక్ ను గుర్తుకు చేస్తోంది అంటూ నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. 
Balakrishna-as-NTR-NTR-biopic-launch
ఈసినిమా షూటింగ్ ప్రారంభం అయిన మొదటిరోజు నుండి బాలకృష్ణ రోజుకు మూడు సీన్స్ చప్పున పూర్తి చేస్తున్న వేగం చూసి దర్శకుడు క్రిష్ షాక్ అవుతున్నట్లు సమాచారం. ఈ బయోపిక్ లోని ప్రతి సన్నివేసం ఒక అద్భుతంగా రావాలని అని బాలయ్య పడుతున్న తపన చూసి ఈమూవీ యూనిట్ వర్గాలు ఆశ్చర్య పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
Nandamuri Balakrishna will play his father, NT Rama Rao, in the NTR biopic.
ముఖ్యంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కోసం బాలకృష్ణ పెంచుకున్న మీసకట్టును తీసివేసి తన తండ్రి ఎన్టీఆర్ పాత్ర కోసం సన్నటి మీసంతో అలనాటి ఎన్టీఆర్ లుక్ ను గుర్తుకు చేసేలా బాలయ్య చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ తన కెరియర్ తొలినాళ్ళలో నటించిన సినిమాలలో సన్నగా కనిపించిన నేపధ్యంలో ఆసన్నివేసాల సహజత్వం కోసం ఇప్పటికే బాలయ్య తన బరువును 20 కేజీలు తగ్గించుకున్నట్లు టాక్.
NTR biopic
అంతేకాదు మరో 10 కేజీల బరువు తాను తగ్గుతాను అని చెపుతున్న బాలయ్య డెడికేషన్ చూసి క్రిష్ ఆశ్చర్య పోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన తల్లి బసవతారకం ప్రభావం ఎన్టీఆర్ పై ఏ విధంగా ఉందో చూపించే విధంగా ఈమూవీలో బసవతారకం పాత్రను హైలెట్ చేస్తూ కొన్ని సీన్స్ ను బాలకృష్ణ ప్రత్యేకంగా వ్రాయించినట్లు తెలుస్తోంది. బసవతారకం లుక్ ను పోలి ఉండేలా విద్య బాలన్ కు మేకప్ చేయడానికి రకరాకాల మేకప్ స్కెచ్ లను తయారు చేయిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈమూవీలోని సంభాషణలు పాటల విషయంలో బాలకృష్ణ విపరీతమైన శ్రద్ద తీసుకుంటూ తన తండ్రి బయోపిక్ ని చరిత్రలో నిలిచిపోయే దృశ్య కావ్యంలా మలచడానికి అన్ని శక్తులు ధారపోసి ప్రయత్నిస్తున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: