తెలుగు ఇండస్ట్రీలో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ తర్వాత ఎవడే సుభ్రమణ్యం, పెళ్లి చూపులతో ఒక మంచి నటుడిగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ, ఆ తరువాత అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. మొదటి నుంచి ఎన్నో కాంట్రవర్సీలు సృష్టిస్తూ వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం..థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ లేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా యూత్ ను ఎంతగా ఎట్రాక్ట్ చేసింది అంటే.. మూడు గంటల సినిమా కూడా అప్పుడే అయిపోయిందా అనే విధంగా ఉంది.  అంతసేపు ప్రేక్షకులను కూర్చోపెట్టగలిగారు కాబట్టే అర్జున్ రెడ్డి యూత్ ను ఎట్రాక్ చేసింది.   
Image result for arjun reddy
ఈ సినిమా ఎంత నేచురల్ గా ఉందంటే..చాలా మంది యూత్ కొంత కాలం వరకు అర్జున్ రెడ్డికి రియల్ గా కనెక్ట్ అయ్యేలా ఉంది.  ఇప్పుడు అర్జున్ రెడ్డి వైపు పరభాషలు చూస్తున్నాయి.  ఇప్పటికే తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు.  త్వరలోనే అక్కడ షూటింగ్ ప్రారంభం కాబోతున్నది.  ఇటు హిందీలోను అర్జున్ రెడ్డిని రీమేక్ చేయబోతున్నారు.  హిందీ రీమేక్ వెర్షన్ కు ఒరిజినల్ దర్శకుడు సందీప్ వంగనే దర్శకత్వం వహిస్తున్నారు.  షాహిద్ కపూర్ ఇందులో హీరో.  త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనున్నది. 
Image result for arjun reddy
ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. ఇప్పుడు వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్నాడు.  మహానటిలో ఫోటోగ్రాఫర్ ఆంటోనిగా నటించిన విజయ్, టాక్సీవాలా, గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేస్తున్నాడు.  టాక్సీవాలా ఇప్పటికే షూటింగ్ పూర్తయినా, ఆ సినిమాను పక్కన పెట్టి గీతాఆర్ట్స్ సంస్థ ముందు గీతాగోవిందం ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వీటితో పాటు విజయ్ మొబైల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.  దట్ ఈజ్ అర్జున్ రెడ్డి.  


మరింత సమాచారం తెలుసుకోండి: