నేను చెగువేరా జీవితం నుంచి నేర్చుకుంది ముఖ్యంగా ‘ప్రపంచంలో అరాచకం, దోపిడి, నిరంకుశత్వం ఉన్న వ్యవస్థల వల్ల ప్రజలు తీవ్ర బాధలు పడుతున్నపుడు, నువ్వు ఆ దేశపు మనిషివి కానప్పటికీ, నీకు వ్యక్తిగతంగా ఏమీ జరగనప్పటికీ, నువ్వు పెరిగిన దేశపు, సమాజపు హద్దులను చెరిపేసి ప్రపంచ పీడిత ప్రజలకు అండగా నిలబాలి’ అని చెప్పినావాడు, అంతే కాదు జీవితపు అంతిమ క్షణాలు వరకు తాను నమ్మిన సిద్దాంతాన్ని నడిచి చూపించి విశ్వనరుడు ‘చెగువేరా’. 

Image result for pawan kalyan twitter

అందుకేనేమో దశాబ్ధాల క్రితం, ఎక్కడో దక్షిణ అమెరికాలో అర్జెంటీనాలో పుట్టి పెరిగి, క్యూబా, ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాలలో పోరాటాలు చేసిన చెగువేరా ఉత్తరాంధ్రలోని ఓ మూలకి విసిరేసినట్టుండే ఇచ్చాపురంలో స్వేచ్ఛామాత గుడికి వెళ్లే విధికి ఎదురుగా ’ ఒక చెప్పుల దుకాణంపైన విశ్వనరుడు చేగువేరా ముఖచిత్రం నాకు దర్శనమిచ్చింది’ అని ట్విట్ చేశారు పవన్ కళ్యాన్.
Related image
తాజాగా రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఉన్న మ్యూజియంలో చేగువేరా మైనపు విగ్రహం పక్కన నిలబడి... తన కుమార్తె పొలీనా అంజనీ దిగిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా ఆయన పంచుకున్నారు. చేగువేరా మాదిరి చేయెత్తి పిడికిలి చూపిస్తున్న పొలీనా ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   "నెల్లూరులో ఇంటర్ తొలి సంవత్సరం చదువుతున్నప్పుడు... తొలిసారి చేగువేరా గురించి చదివా. ఏదో ఒక రూపంలో, ఎక్కడో ఒక చోట ఆయన నా జీవితంలో ఉంటున్నారు. ఇలా జరుగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది" అంటూ ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: