తెలుగు ఇండస్ట్రీలో పాత తరం హీరోయిన్లలో సావిత్రి, జమున, కాంచనల తర్వాత కేఆర్ విజయ కు మంచి క్రేజ్ ఉండేది.  తన అందంతోనే కాదు అద్భుతమైన నటనతో ఎంతోమంది హృదయాలను దోచేసిన అలనాటి హీరోయిన్ కేఆర్ విజయ. సాంఘిక .. జానపద .. పౌరాణిక చిత్రాల్లో అద్భుతంగా నటించి మెప్పించిన ఘనత ఆమె సొంతం. ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లో దేవత పాత్ర అనగానే అప్పట్లో అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు కేఆర్ విజయ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.."శ్రీకృష్ణ పాండవీయం'లో రుక్మిణీదేవి పాత్రలో నటించే ఛాన్స్ వచ్చింది.
Related image
ఆ పాత్ర నాకు చాలామంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా నుంచే నన్ను దేవతా పాత్రలకి ఎక్కువగా అడిగేవారు.  ప్రముఖ వ్యాపారవేత్తు, నిర్మాత వేలాయుదం తో వివాహం జరిగిన తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో నటించానని చెప్పారు.    అప్పట్లోనే ఆయనకి సొంత విమానం .. షిప్పు ఉండేవి. ఆయన మంచితనం .. మంచి మనసును చూసి మాత్రమే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను" అని ఆమె చెప్పుకొచ్చారు.
Image result for kr vijaya ntr
పౌరాణిక చిత్రాలకి రారాజుగా చెప్పుకునే ఎన్టీఆర్ తోను కలిసి ఆమె చాలా సినిమాల్లో నటించారు. ఇక ఎన్టీఆర్ గురించి చెబుతూ..ఆయన రూపం చూస్తే ఎవరికైనా ఇట్టే నచ్చుతుంది..గంభీరమైన విగ్రహం ఆయనది.  షూటింగులో పెద్ద కిరీటం పెట్టుకుని ఎంతసేపైనా ఆయన అలాగే ఉండేవారు .. బరువైన ఆభరణాలను ధరించి అలా కూర్చునే వుండేవారు. 
Image result for kr vijaya ntr
నేను ఒక్కోసారి అలసిపోయి కాస్త కునుకు తీస్తే..ఆయనే స్వయంగా వచ్చి 'విజయ గారూ' అంటూ గట్టిగా పిలిచి .. 'ఇది మీ సీన్' అంటూ బాగా చేయాలనే ఉద్దేశంతో ఉత్సాహపరిచేవారు. ఆయన నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను" అంటూ ఆమె చెప్పుకొచ్చారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: