తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నట వారసులుగా ఇప్పటికే అరడజను మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు.  అయితే ఇండస్ట్రీలో ఇంత మంది హీరోలు వచ్చినా..ఎవరూ ఎవరికి పోటీకాదు.  ఎవరి టాలెంట్ వారు చూపించుకుంటూ ముందుకు వెళ్తున్నారు.  అయితే పవన్ కళ్యాన్ తర్వాత అల్లు అర్జున్, రాంచరణ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. 
Related image
కొత్తగా వస్తున్న సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు ఇప్పుడిప్పుడే హీరోలుగా తమ టాలెంట్ ప్రూఫ్ చేసుకుంటున్నారు.  ఇక ఫిదా, తొలిప్రేమ చిత్రాలతో వరుణ్ తేజ్ మంచి క్రేజ్ లో ఉన్నాడు.  సుప్రీమ్ సినిమా తర్వాత వరుసగా వచ్చిన తిక్క, విన్నర్, జవాన్, ఇంటిలీజెంట్ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి.  దాంతో మనోడికి మంచి విజయం కావాల్సిన సమయంలో ‘తొలిప్రేమ’తో ఓ ట్రెండ్ సృష్టించిన దర్శకులు కరుణాకరణ్ దర్శకత్వంలో ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమాతో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.   

Image result for sai dharam tej

ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో యావరేజ్ టాక్ తెచ్చుకుంది.  దాంతో మనోడికి మరో ఫ్లాప్..అంతే కాదు ఆ ఫ్లాప్ ఎఫెక్ట్ మామూలుగా లేదు.  ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమాకు మంచి కాంబినేషన్ వుండి, పబ్లిసిటీ వుండి కూడా ఓపెనింగ్స్ రాకపోతే కాస్త ఆలోచించాల్సిందే. సాయిధరమ్ తేజ లేటెస్ట్ సినిమా తేజ్ ఐలవ్ యూ తొలిరోజు వసూళ్లు చాలా నిరాశజనకంగా వున్నాయి. గట్టిగా కోటీ ఎనభైలక్షల షేర్ రాలేదు.   జోనర్ మార్చి, తొలిసారి లవ్ జోనర్ చేసి, కాస్త ఆశపడినా ‘తేజ్ ఐలవ్ యూ’ కూడా ఓపెనింగ్స్ నిరాశ పరిచాయి. 
Image result for tej i love
గతంలో ఇంటిలిజెంట్ కే మరీ గొప్ప ఓపెనింగ్స్ రాలేదు. రెండుకోట్ల రేంజ్ లో వచ్చాయి. 
ఇప్పుడు అంతకన్నా తగ్గాయి. అయితే ఫ్యాన్స్ మాత్రం శని, ఆదివారాల్లో మంచి కలెక్షన్లు నమోదు అవుతాయని నమ్మకంతో వున్నారు. ఒకవేల ఫస్ట్  అంతాకలిపి నాలుగుకోట్ల దగ్గరకు చేరినా, టోటల్ రన్ లో ఇంకా చాలా రావాల్సి వుంటుంది. ఎందుకంటే ఈ సినిమాను 16 కోట్ల రేంజ్ లో మార్కెట్ చేసారు.
 
‘తేజ్ ఐ లవ్ యూ’ఏరియా వైజ్ కలెక్షన్లు : 
నైజామ్ : 0.47
సీడెడ్ : 0.28
ఉత్తరాంధ్ర : 0.26
ఈస్ట్ : 0.19
వెస్ట్ : 0.18
కృష్ణ : 0.12
నెల్లూరు : 0.07
మొత్తం : 1.82 కోట్లు



మరింత సమాచారం తెలుసుకోండి: