మెగా మేనళ్లుడు హీరోగా కరుణాకరణ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా తేజ్ ఐలవ్యూ. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె.ఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. నిన్న శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

మొదటి షో టాక్ సినిమా కలక్షన్స్ మీద బాగా ప్రభావం చూపించింది. అందుకే మొదటి రోజు తేజ్ కేవలం 1.50 కోట్ల షేర్ మాత్రమే వసూళ్లు రాబట్టాడు. సాయి ధరం తేజ్ కెరియర్ లో ఫ్లాప్ గా మిగిలిన రేయ్ సినిమానే మొదటి రోజు 2.06 కోట్ల కలక్షన్స్ రాబట్టగా ఈ ఇయర్ వచ్చిన ఇంటిలిజెంట్ కూడా దారుణంగా పోయింది.


అయితే వాటినన్నిటికన్నా తేజ్ ఐలవ్యూ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం కోటిన్నర మాత్రమే కలెక్ట్ చేయడం ఆశ్చర్యకరంగా ఉంది. కరుణాకరణ్, తేజూ కాంబినేషన్ లో లవ్ స్టోరీ అంటూ క్రేజీగా వచ్చిన తేజ్ ఐలవ్యూ ఇంత దారుణమైన వసూళ్లను రాబడుతుందని ఎవరు ఊహించి ఉండరు.


ఓ పక్క ఈ సినిమాకు పోటీగా వచ్చిన గోపిచంద్ పంతం సినిమా దీనికన్నా బెటర్ టాక్ తో రన్ అవుతుంది. తేజ్ మాత్రం 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అవగా ఆ రేంజ్ కలక్షన్స్ రాబట్టడం సాధ్యం కాదని చెప్పొచ్చు. యూఎస్ లో తేజ్ ఐలవ్యూ పరిస్థితి కూడా దారుణంగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి.  


ఏరియాల వారిగా తేజ్ ఐల్వయూ మొదటి రోజు కలక్షన్స్.. 
నైజాం : 0.40 కోట్లు
సీడెడ్ : 0.27 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.26 కోట్లు
గుంటూరు : 0.25 కోట్లు
ఈస్ట్ : 0.19 కోట్లు
వెస్ట్ : 0.18 కోట్లు
కృష్ణా : 0.12 కోట్లు
నెల్లూరు : 0.07 కోట్లు
ఏపి/ తెలంగాణా కలక్షన్స్ : 1.74 కోట్లు



మరింత సమాచారం తెలుసుకోండి: