పిల్లలకు , పెద్దలకు అత్యంత ఇష్టమైన పాత్రలు సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్‌మ్యాన్. ఆ పాత్ర అంతటి అభిమానాన్ని చూరగొనడానికి వెనకాల ఓ సృష్ఠికర్త వుంటారు.   ఆ పాత్ర అంతటి అభిమానాన్ని చూరగొనడానికి వెనకాల ఓ సృష్ఠికర్త వుంటారు. అతను ఎన్నో ఆలోచనలు చేసి ఆయా పాత్రలను సృష్ఠిస్తాడు. అలాంటి అత్యంత ఆదరణ పొందిన స్ఫైడర్‌మ్యాన్ సహ సృష్టికర్త  స్టీవ్ డిట్కో(90) ఇక లేరు.న్యూయర్క్‌లోని తన ఫ్లాట్‌లో డిట్కో తుదిశ్వాస విడిచాడు.  జూన్ 29‌న డిట్కో మృతి చెందినట్లు పోలీసులు తెలుసుకున్నారు.
Image result for స్టీవ్ డిట్కో
కానీ డిట్కో మృతి చెంది అప్పటికే రెండు, మూడు రోజులై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. డిట్కో మృతిపై ప్రఖ్యాత రచయిత నీల్ గేమన్ నివాళులర్పించారు. 1960లో మార్వెల్ కామిక్స్ సీఈవో స్టాన్‌లీతో కలిసి డిట్కో పనిచేశారు. స్టాన్‌లీ ఇచ్చిన ఐడియాతో డిట్కో స్పైడర్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్ పాత్రలను రూపొందించాడు. నీలం, ఎరుపు రంగుల దుస్తులతో స్పైడర్‌మ్యాన్‌కు రూపం ఇచ్చాడు.  మణికట్లు నుంచి సాలెగూళ్లను ప్రయోగించే శక్తిని స్పైడర్‌మ్యాన్‌కు జోడించింది డిట్కోయే. అవి ఎందరినో ఆకట్టుకుని డిట్కోకి ఎంతో పేరు తెచ్చి పెట్టాయి.
Image result for spider man creator
1961లో డిట్కో అతని మిత్రుడు స్టాన్‌లీతో కలిసి స్పైడర్ మ్యాన్ అనే కారికేచర్‌కు ప్రాణం పోశారు. స్టాన్‌లీ మార్వెల్ కామిక్స్‌కు ఎడిటర్ ఇన్ ఛీఫ్‌గా ఉన్న సమయంలో ఒక టీనేజ్ సూపర్ హీరోను క్రియేట్ చేయాల్సిందిగా డిట్కోకు బాధ్యతలు అప్పగించాడు. వెంటనే ఇదే పనిపై కూర్చున్న డిట్కో తన క్రియేటివిటీని ఉపయోగించి స్పైడర్ మ్యాన్‌ను సృష్టించాడు.  అదే కార్టూన్‌ వినియోగించి సినిమాలు సైతం దర్శనమిచ్చాయి. డాక్టర్ ఆక్టోపస్, శాండ్ మ్యాన్, లిజర్డ్ అండ్ గ్రీన్ గాబ్లిన్ అనే క్యారెక్టర్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఈ ఘనత డిట్కోకే దక్కుతుంది. డిట్కో మరణం తెలుసుకున్న అభిమానులు, ప్రజలు చాలా బాధపడ్డారు. డిట్కో ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: