తెలుగు, తమిళ భాషల్లో దర్శకులు మురగదాస్ అంటే ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇక తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఫ్యాన్స్ ని సంపాదించిన హీరో విజయ్. తాజాగా  తమిళ హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్‌లకు తమిళనాడు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ‘సర్కార్’ సినిమా తెరకెక్కుతోంది. 
Image result for vijay hero sarkar
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఇందులో విజయ్ స్మోకింగ్ చేస్తూ కనిపించడాన్ని ప్రభుత్వం తప్పుపట్టింది. గతంలో మెర్సల్ సినిమా కూడా ఎన్నో వివాదాలకు తెర లేపింది.  ఈ సినిమాలో డాక్టర్లను విమర్శించారని..జీఎస్టీ గురించి కూడా తప్పుగా మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి.  ఇక విజయ్ హీరోగా ‘సర్కార్’ సినిమా తెరకెక్కుతున్న ఈ పోస్టర్ లో స్మోకింగ్ చేస్తూ కనిపించడాన్ని ప్రభుత్వం పట్టిన విషయం తెలిసిందే.  తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణీ రాందాస్ కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
Image result for vijay hero sarkar
‘‘హీరో విజయ్ తన తర్వాతి చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్లో స్మోకింగ్‌ను ప్రమోట్ చేయడం సిగ్గుచేటు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నోటీసుల తర్వాత ఆ పోస్టర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. మహేష్ బాబును తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు తెరకెక్కించిన ‘స్పైడర్’ సినిమా ఇరు భాషల్లో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే.
Image result for murugadas
ఈ నేపథ్యంలో మురుగదాస్ ‘సర్కార్’ సినిమాతో హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయ్, మురుగుదాస్‌ల కాంబినేషన్లో వచ్చిన ‘తుపాకీ’ సినిమా తెలుగులోనూ హిట్ కొట్టింది. ఈ నేపథ్యంలో ‘సర్కార్’ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: