రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య.  పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకోని సుమారు 10 ఏళ్ళు దాటి పోయింది. అయితే ఇన్నాళ్లు తరువాత విడాకుల గురించి నిజాలు బయట పెట్టాల్సిన పనేముంది. పోనీ అభిమానుల వేధింపులు అనుకుందాము..!సోషల్ మీడియాలో ఎన్నో ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. తనను టార్గెట్ చేసిన వ్యక్తులు పవన్ అభిమానులని ఋజువు ఏంటి...!  ఈ చిన్న లాజిక్ రేణు దేశాయ్ కు తెలియనిది కాదు..!

Image result for renu desai

ఆమె ఈ చిట్ చిట్ లో ఓ విషయం క్లారిటీగా చెప్పారు. తను చేసుకోబోయే వ్యక్తి, తను ఎంటర్ కాబోయే కొత్త కుటుంబం కోరిక మేరకు ఇప్పుడు అన్ని విషయాలు బయట పెడుతున్నట్లు వెల్లడించారు. తనను చేసుకోబోయేవారు, తనను స్వాగతించే కుటుంబం తన గతం గురించి అంతా తెలుసుకునే ఓకె అన్నారని చెబుతూనే, మరి అలాంటపుడు, నీ తప్పు లేనపుడు ఓపెన్ గా చెప్పవచ్చు కదా అని అన్నారని రేణు దేశాయ్ అన్నారు. ఈ విషయాన్ని ఒకటికి రెండు సార్లు చెప్పడం విశేషం. అంటే రేణు ఓపెన్ అప్ అవ్వడం అన్నది ఆమె ఇష్టం ప్రకారం జరిగినట్లు కాకుండా, చేసుకోబోయే భర్త, అత్తింటి వారి వత్తిడి లేదా సలహా కారణంగా జరిగినట్లు కనిపిస్తోంది.

Image result for renu desai

ఒక పక్క రాజకీయాల్లో వున్నపుడు ఇలా మాట్లాడితే, పొలిటికల్ గా వస్తుందని తాను భావిస్తూ వచ్చానని అంటూనే, మళ్లీ అన్నీ వివరంగా చెపుతూ రావడం అంటే కాస్త చిత్రంగానే వుంది. అయినా రేణు గతం పూర్తిగా తెరచిన పుస్తకమే. పోనీ తెరవెనుక జరిగిన విషయాలు ఆమె ద్వారా తెలుసుకుని కూడా, మళ్లీ వాటిని బహిరంగంగా చెప్పమని, రేణు దేశాయ్ ను చేసుకోబోయే భర్త, ఆమెను స్వాగతించే కుటుంబం ప్రభావం, ప్రోద్బలం, ప్రోత్సాహం,ఇంకా చెప్పాలంటే వత్తిడి ఎక్కువగా వుందని అనిపిస్తోంది. తామెవరో, తమ కుటుంబం ఏమిటో బయటకు రాకుండానే, తెరవెనుకే వుంటూ, రేణు దేశాయ్ ను మాత్రం తెరముందుకు తీసుకువచ్చారు. ఇదంతా ఏమిటో? ఎందుకో?


మరింత సమాచారం తెలుసుకోండి: