బయోపిక్ సినిమాలంటే కేవలం ఓ డాక్యుమెంటరీ లానే ఉంటాయన్న భావనని తొలగించి సినిమాటిక్ అప్పీల్ తో జనరంజకంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల వచ్చిన మహానటి సినిమా దానికి ఓ చక్కని ఉదాహరణ ఇక ఇప్పుడు తెలుగులో బయోపిక్ ల హవా నడుస్తుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ ఆల్రెడీ మొదలవగా.. వైఎస్సార్ బయోపిక్ యాత్ర కూడా షూటింగ్ జరుపుకుంటుంది.


యాత్ర సినిమాను మహి వి రాఘవ డైరెక్ట్ చేస్తున్నాడు. విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. వైఎస్సార్ పాదయాత్ర నేపథ్యంతోనే ఈ సినిమా రాబోతుంది. పాదయాత్రతో ప్రజల మనసులను గెలిచి సిఎం గద్దె ఎక్కిన మహానేత వై.ఎస్.ఆర్. యాత్ర టీజర్ ఈరోజు వై.ఎస్.ఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.


తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది.. వాళ్లతో కలిసి నడవాలని ఉంది.. వాళ్ల గుండెచప్పుడు వినాలని ఉంది.. గెలిస్తే పట్టుదల అంటారు.. ఓడిపోతే మూర్ఖత్వం అంటారు.. ఈ పాదయాత్ర నా మూర్ఖత్వమో.. పట్టుదలో.. చరిత్రనే నిర్ణయించుకోవచ్చు.. అని వై.ఎస్.ఆర్ పాత్రలో మమ్ముట్టి చెప్పిన డైలాగ్ అద్భుతంగా ఉన్నాయి.  


నిజంగా వై.ఎస్ అభిమానులకు ఈ సినిమా ఎలాంటి కానుక ఇస్తుదో టీజర్ తోనే చెప్పేశారు దర్శక నిర్మాతలు. వై.ఎస్ గా మమ్ముట్టి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. టీజర్ తో అదరగొట్టిన యాత్ర సినిమా కూడా ప్రేక్షకుల మనసులను పరశింప చేసేలా ఉంటుందని అంచనా వేయొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: