టాలీవుడ్ లో ఇప్పటివరకు రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, రామకృష్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియో, సారధి స్టూడియో ఉన్నాయి. ఒక్క సారధి స్టూడియో తప్ప మిగతావి హీరోల కుటుంబాలకు సంబందించినవే అని తెలిసిందే. ఒక్క మెగా ఫ్యామిలీకే ఎలాంటి స్టూడియో లేకుండా పోయింది.


రాబోతున్న విజేత హీరో కళ్యాణ్ దేవ్ తో కలుపుకుని దాదాపు 9 మంది హీరోలున్న మెగా ఫ్యామిలీలో తమకంటూ ఓ స్టూడియో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. అంతేకాదు మెగా స్టూడియో నిర్మించాలన్నది చిరంజీవి కల అని తెలుస్తుంది. వారు తలచుకుంటే అదేం పెద్ద మ్యాటర్ కాదు. 


అల్లు అరవింద్ ఈ స్టూడియో బాధ్యతలను తీసుకుంటారని అన్నారు. దాని కోసమే వైజాగ్ లో స్థలం కూడా కొన్నారని తెలిసింది. కాని అక్కడ ఇప్పుడే స్టూడియో డెవలప్ అవదని తెలుసుకుని మళ్లీ హైదరాబాద్ లోనే మెగా స్టూడియో కట్టాలని ఫిక్స్ అయ్యారు. అందుకే కోకాపేటలో 22 ఎకరాల స్థలం బేరం చేశారట. 


800 కోట్ల ఖర్చుతో ఈ మెగా స్టూడియో కట్టబోతున్నారట. హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్ చేసుకునేలా.. ఆ స్టూడియోలకు ధీటుగా మెగా స్టూడియో ఏర్పాటు చేయబోతున్నారట. చిరు కలని నెరవేర్చాలనుకుంటున్న చరణ్ భారీ ప్లానే వేశాడని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: