దర్శక నిర్మాతలంగా ప్రస్తుతం బయోపిక్ సినిమాల మీద దృష్టి పెట్టడంతో రానున్న సినిమాల హంగామాలో అవి కూడా భాగం కానున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్.టి.ఆర్, వైఎస్సార్ బయోపిక్ గా వస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. ఎన్.టి.ఆర్ బయోపిక్ గా బాలకృష్ణ ఎన్.టి.ఆర్ సినిమాతో వస్తుండగా వైఎస్సార్ బయోపిక్ గా యాత్ర సినిమా వస్తుంది. 


ఆనందో బ్రహ్మ డైరెక్ట్ చేసిన మహి వి రాఘవ యాత్ర సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈరోజు వై.ఎస్.ఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్ రిలీజ్ చేశారు. యాత్ర టైటిల్ కు తగినట్టుగానే వై.ఎస్.ఆర్ పాదయాత్రతోనే సినిమా ఎక్కువ భాగం ఉండబోతుందని తెలుస్తుంది.


ఇక ఈ సినిమా టీజర్ లోని డైలాగ్స్, మమ్ముట్టి లుక్ అన్ని యాత్ర మీద అంచనాలు పెంచేశాయి. యాత్ర టీజర్ సూపర్ హిట్ అయ్యింది. సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటుందని ఆశిస్తున్నారు. అయితే వై.ఎస్ బయోపిక్ టీజర్ ఎన్.టి.ఆర్ సినిమాపై తీవ్ర ఒత్తిడిని పెంచిందని చెప్పొచ్చు. క్రిష్ డైరక్షన్ లో రీసెంట్ గా మళ్లీ మొదలైన ఈ సినిమా టీజర్ త్వరలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 


యాత్ర టీజర్ తో వై.ఎస్ అభిమానులు సంతోషంగా ఉన్నారు. జననేత చరిత్ర అందరు మెచ్చేలా తెరకెక్కించబోతున్నారని టీజర్ తోనే చెప్పారు. యాత్రకు ధీటుగా ఎన్.టి.ఆర్ బయోపిక్ భారీ అంచనాలతో వస్తుంది. సినిమాలో స్టార్ కాస్ట్ కూడా పెద్ద లిస్టే వినపడుతుంది. మరి ఎన్టీఆర్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.    



మరింత సమాచారం తెలుసుకోండి: