ఈమధ్య కాలంలో చిన్న సినిమా అయినా టీజర్, ట్రైలర్ తో హంగామా చేస్తున్న మూవీ ఆరెక్స్ 100. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కలిసి నటించిన ఈ సినిమా వచ్చే శుక్రవారం రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లో హీరో, హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సీన్స్ అదిరిపోయాయి. 


ఇంటెన్స్ ఉన్న సినిమా కథగా వస్తున్న ఈ ఆరెక్స్ 100 మూవీ సినిమా ప్రమోషన్స్ లో రొటీన్ రొట్ట సినిమాలు చూసే ఆడియెన్స్ కు ఇది నచ్చకపోవచ్చు అలాంటి వారు తమ సినిమా చూడొద్దని చెబుతున్నాడు అజయ్. వెరైటీ సినిమాలను ఆదరించే వారికి తప్పకుండా ఈ సినిమా తప్పక నచ్చుతుందని అంటున్నాడు.


రాం గోపాల్ వర్మ దగ్గర శిష్యుడిగా పనిచేసిన అజయ్ మొదటి సినిమా ఆరెక్స్ 100. సినిమా ట్రైలర్ మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. సినిమా తప్పకుండా ఆడుతుందని ఒకవేళ ఆడకపోతే వెళ్లి తన ఊరిలో గేదెలు కాసుకుంటా అంటున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. పాయల్ రాజ్ పుత్ అందాలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయి.


అసలైతే ముందు ఈ కథను అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండకు చెప్పగా అతాను ఎందుకో ఈ సినిమా చేయనన్నాడని కార్తికేయ కూడా బాగా చేశాడని అన్నారు అజయ్ భూపతి. కార్తికేయ తండ్రి అశోక్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా మెగా అల్లుడు విజేత సినిమకు పోటీగా వస్తుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: