రేణు దేశాయ్ పవన్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన తాను ఒక గొప్ప సామాజిక దృఢత్వం కలిగిన వ్యక్తి అని కితాబు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తరువాత ఒంటరిగా బతకడం కష్టం అని అది చాలా నరకమని వెల్లడించింది. అయినా రేణు దేశాయ్ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ మీద కూడా నోరు జారలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ ను పొగిడిందని చెప్పాలి. 

Image result for pawan kalyan and renu desai

ఆమె ఎంత గొప్ప మ‌న‌స్కురాలో ఆ మాట‌లు వింటే అర్థమ‌వుతుంది. విడాకులు తీసుకున్నప్పుడు ఆద్య చాలా చిన్నపిల్ల. ఎనిమిదేళ్లు ఒంట‌రిగా ఉండ‌డం, ఇద్దరు పిల్లల‌ను పెంచ‌డం న‌ర‌కంగా ఉంటుంది. విడాకుల త‌ర్వాత నా బాధ‌ను వ‌ర్ణించ‌డానికి క‌ష్టం కంటే పెద్ద ప‌దంకావాలి. వ్యక్తి జీవితంలో పొర‌పాట్లు చేసి ఉండొచ్చు. కాని సామాజికంగా ఆయ‌న చాలా స్ర్టాంగ్‌. ప‌వ‌న్ నిజంగా గొప్పతండ్రి. ఏడాదికి రెండుసార్లు వ‌చ్చి పోతుంటారు. టైం దొరికిన‌ప్పుడ‌ల్లా పిల్లల్ని బాగా చూసుకుంటారని త‌న మ‌న‌సులో మాట‌ను వెల్లడించారు. 

Image result for pawan kalyan and renu desai

ఇద్దరు పిల్ల‌ల‌ను పెంచ‌డం న‌ర‌కంగా ఉంటుందని చెప్పడంలోనే ఆమె ఎంత వేద‌న అనుభ‌వించి ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. త‌న క‌ష్టన‌ష్టాల‌కు, సుఖ‌దుఃఖాల‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ కార‌ణ‌మైన‌ప్పటికీ అత‌న్ని కించ‌ప‌రిచేలా ఎక్కడా నోరుజార‌లేదు. పైగా జీవితంలో పొర‌పాట్లు జ‌రిగి ఉండొచ్చని, అత‌ను సామాజికంగా చాలా బ‌ల‌వంతుడ‌ని కితాబిచ్చారు. రాజ‌కీయ నాయ‌కుడికి ఉండాల్సిన అస‌లుసిస‌లు ల‌క్షణం సామాజిక దృఢ‌త్వమే. అంటే దేన్నైనా ఎదురించ‌గ‌లిగే సాహ‌సం, త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగే అంకితభావం ప‌వ‌న్‌లో పుష్కలంగా ఉన్నాయ‌ని ఆమె ఒక్కమాట‌లో చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: