తన నోటికి ఏది వస్తే..అది మాట్లాడుతూ..ట్విట్స్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ వస్తున్న సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఈ మద్య   ఓ ఛానల్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీరాముడి గురించి కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు కత్తి మహేష్‌‌పై విరుచుకుపడ్డారు. కత్తిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 1 తో పరిచయం అయిన కత్తి మహేష్ తర్వాత పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు.  

Related image

కత్తి మహేష్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ గొడవ  దాదాపు నాలుగు నెలల పాటు సాగింది. ఆ తర్వాత శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ వ్యహారంలో కూడా కొన్ని వివాదాలు చెలరేగాయి.  హిందువులు ఎంతో భక్తితో కొలిచే శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి.  పలు చోట్ల కేసులు కూడా నమోదు అయ్యాయి.   తాజాగా కత్తి మహేష్ పై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు.  


కత్తి మహేష్‌పై హైదరాబాద్‌ పోలీసులు బహిష్కరణ వేటు వేశారు. తమ అనుమతి లేకుండా హైదరాబాద్‌కు రావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.  ఈ మేరకు కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది.   మరోవైపు శ్రీరాముని కత్తి మహేష్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు పూనుకున్నారు. కాగా ఈ యాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: