దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. ఈ చిత్రంలో రాజశేఖరరె డ్డి పాత్రను ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి పోషిస్తున్నారు. వైఎస్సార్ చేపట్టిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రను కథాంశంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, అందుకే దీనికి ‘యాత్ర’ అనే టైటిల్‌ను పెట్టామని దర్శక నిర్మాతలు ఇప్పటికే వెల్లడించారు. వైస్. రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని నిన్న ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.

వైఎస్ఆర్ జన్మదినం సందర్భంగా ‘యాత్ర’జులై 8 అర్థరాత్రి 00.00.01 గంటలకు ఆయన పుట్టిన సమయానికే టీజర్‌ను విడుదల చేశారు. దాదాపు 54 సెకెండ్ల నిడివిగల ఈ టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.  యూ ట్యూబ్ లో కొన్ని గంటల్లోనే ఈ టీజర్ 10 లక్షలకి పైగా వ్యూస్ ను రాబట్టింది. అదే ఊపును కొనసాగిస్తూ ఇప్పుడు ఈ టీజర్ 12 లక్షలకి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. గూగుల్ ట్రెండ్స్ లోను ఈ టీజర్ ప్రముఖంగా నిలిచింది. ఇక ఫేస్ బుక్ .. వాట్సాప్ లలోను ఈ టీజర్ అదే జోరును కొనసాగించింది. 

ఈ సినిమా టీజర్ కి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం పట్ల యూనిట్ సభ్యులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధిస్తుందని చెప్పడానికి ఈ వ్యూస్ నిదర్శనమని చెప్పుకుంటున్నారు. వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: