తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాన్ ‘అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా విజయం కాకపోయినా..తొలిప్రేమ, తమ్ముడు, బద్రి లాంటి చిత్రాలతో భారీ విజయాలు సాధించాడు.  ఇక అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి చిత్రాలతో మెగాస్టార్ రేంజ్ లో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ప్రస్తుతం జనసేన పార్టీ స్థాపించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.  ఈ నేపథ్యంలో ఆయన తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడు. 

 అజ్ఞాతవాసి చిత్రం తర్వాత కాస్త విరామం ఇచ్చి..పూర్తిగా రాజ‌కీయాల‌పైనే దృష్టి సారించారు. ప‌వ‌న్‌ విశాఖ‌లో తాజాగా నిర‌స‌న క‌వాతులో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఆ సంద‌ర్భంగా త‌న కెరీర్ కొత్త‌లో ఎదురైన అనుభ‌వాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు.  ఇండస్ట్రీకి రాకముందు నుంచి నాకు కాస్త సిగ్గూ..బిడియం ఎక్కువ. దాంతో కెరీర్ బిగినింగ్ లో కొన్ని సందర్భాల్లో ఎన్నో చాలా ఇబ్బందులు పడ్డానని అన్నారు.  ఇక  `సుస్వాగ‌తం` చిత్రం షూటింగ్ జరిగే సమయంలో నా చుట్టూ వేల మంది ఉన్నారు. 
Related image
డ్యాన్స్ అందరూ చూస్తుండగానే కంపోజ్ చేస్తున్నారు.  బస్సు పైకి ఎక్కి డ్యాన్స్ చేయాలని చెప్పారు..దాంతో నా గుండె గుభేల్ మంది.   అంత మంది ముందు డ్యాన్స్ చేయ‌డం నాకు చాలా సిగ్గుగా అనిపించింది. ఏం చేయాలో తెలియ‌క వ‌దిన సురేఖ‌కు ఫోన్ చేశా. `నేను సినిమాల‌కు ప‌నికిరాను. ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోదామ‌నుకుంటున్నాన‌`ని వ‌దినకి చెప్పాను` కానీ మా వదిన ఇది నీకు ఆరంభం..ఇలాంటి వాటిని ఎదుర్కొంటే..భవిష్యత్ లో మంచి స్టార్ హీరోగా మారుతావని ధైర్యం చెప్పింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: