ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో దేవత పాత్రల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానం పొందిన నటీమణి కేఆర్ విజయ.  అచ్చమైన తెలుగు తనం ఆమెలో నింపుకొని అమ్మోరుగా ఎన్నో చిత్రాల్లో నటించారు కేఆర్ విజయ.  ఆనాటి అగ్రకథానాయికలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మావారితో నాకు పరిచయం చాలా గమ్మత్తుగా జరిగిందని..ఆయన ఫైనాన్స్ చేసిన ఒక సినిమాలో నేను నటిస్తున్నప్పుడు ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
Image result for kr vijay
ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నాం. నేను సినిమాలతో బిజీగా ఉండటం వలన నా పెళ్లి విషయం బయటికి చెప్పకుండా దాచిపెట్టాము. ఒకసారి ఇద్దరం కలిసి సిలోన్ వెళ్లాము .. అప్పుడు ఫ్లైట్ నుంచి దిగుతుండగా ఎవరో మమ్మల్ని ఫొటో తీశారు.  ఇంకేముంది..మరుసటి రోజు పేపర్లలో మా ఫోటో చూసి అందరూ ఆశ్చర్యపోయారు..దాంతో మా పెళ్లైందని అందరికీ చెప్పేశాం. 
Image result for kr vijaya ntr
ఇక ఎన్టీఆర్ దర్శకత్వంలో   'శ్రీకృష్ణపాండవీయం' చిత్రంలో  రుక్మిణి పాత్ర కోసం నన్ను అడిగారు. క్మిణీ దేవి పాత్రకి సంబంధించిన నగల కోసం కొలతలు తీసుకుని మరీ తయారుచేయించారు. నా మేకప్ విషయంలో ఎన్టీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఇక రుక్మిణి పాత్ర లో ఎలా నటించాలో ప్రతి ఒక్క విషయాన్ని ఆయన క్షుణ్ణంగా నాకు దగ్గరుండి వివరించారు..ఆయన ఎలా చెబితే నేను అలా నటించాను.  అప్పట్లో ఆ చిత్రం ఘన విజయం సాధించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: