‘నాపేరు సూర్య’ ఘోర పరాజయం తరువాత అనేక ఆలోచనలు చేసిన అల్లు అర్జున్ చిట్టచివరకు విక్రమ్  కుమార్ దర్శకత్వంలో మూవీ చేయడానికి అంగీకరించడం వెనుక పెద్ద మేధోమధనం జరిగింది అని తెలుస్తోంది. బన్నీ సొంత బ్యానర్ గీత ఆర్ట్స్ నిర్మాణ సారధ్యంలో నిర్మింపబడే 100 కోట్ల బడ్జెట్ కావాలి అని విక్రమ్ కుమార్ అడుగుతూ ఉండటం షాకింగ్ గా మారింది. 
Allu Arjun in Naa Peru Surya
మొదట్లో ఈ భారీ బడ్జెట్ విషయానికి షాక్ అయిన అల్లు కాంపౌండ్ విక్రమ్ కుమార్ తో సినిమాను చేసే ప్రపోజల్ ను తప్పించాలని భావించినా మరి ఏ టాప్ డైరెక్టర్ ప్రస్తుతానికి బన్నీకి అందుబాటులో లేకపోవడంతో విక్రమ్ కుమార్ బడ్జెట్ కండిషన్స్ కు అంగీకరించినట్లు సమాచారం. అఖిల్ తో ‘హలో’ లాంటి భారీ ఫెయిల్యూర్ ఇచ్చిన తరువాత కూడ విక్రమ్ కుమార్ మాటలకు అల్లు కాంపౌండ్ ఈస్థాయిలో పడిపోయింది అంటే ఈకథలో అంత దమ్ము ఉందా అన్న ఆశ్చర్యాన్ని ఇండస్ట్రీ వర్గాలు వ్యక్తపరుస్తున్నాయి. 
Allu Arjun
100 కోట్ల భారీ ఖర్చుతో అత్యంత భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ తో నిర్మించబోతున్న ఈమూవీ బన్నీ కెరియర్ లోనే అత్యంత్ ఖరీదైన ప్రాజెక్ట్ గా పేర్కొనడం జరుగుతోంది. ఈసినిమాకు సంబందించిన కథ విషయంలో బెస్ట్ అవుట్ పుట్ కావాలి అంటే ఈ స్థాయిలో ఖర్చు పెట్టాలి అని భావిస్తున్న విక్రమ్ కుమార్ ఈ సినిమాకు సంబంధించి స్క్రీన్ ప్లేను ఒక ప్రముఖ బాలీవుడ్ స్క్రీన్ ప్లే రైటర్ చేత రాయిస్తున్నట్లు సమాచారం. 
விஜயை பின்பற்றி ராணுவ வீரராக நடிக்கும் தெலுங்கு நடிகர்..!
అయితే ‘నాపేరు సూర్య’ ఘోర పరాజయం తరువాత ఈ స్థాయిలో బన్నీ పై అల్లు కాంపౌండ్ ఖర్చు పెడుతోంది అంటే ఈమూవీ కథలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బన్నీ మార్కెట్ డౌన్ ట్రెండ్ లో నడుస్తున్న నేపధ్యంలో ఇది అల్లు అర్జున్ పై చేస్తున్న అత్యంత ఖరీదైన ప్రయోగం అని ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: