ఇటీవలి కాలంలో ట్రైలర్‌తో ఆకట్టుకున్న చిన్న చిత్రం అంటే.. అది ఖచ్చితంగా ‘ఆర్ఎక్స్100’ అనే చెప్పాలి.  కార్తికేయ, పాయల్ రాజ్‌పుట్‌ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'ఆర్‌ఎక్స్‌ 100'(RX 100)'.    ఈ నెల 12న రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్రయూనిట్ తాజాగా ‘రెప్పల నిండై’ అనే సాంగ్‌ టీజర్‌ను రిలీజ్ చేసారు. ఈ చిత్రంతో అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రావురమేష్, రాంకీ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను భావోద్వేగాలతో కూడిన సహజమైన ప్రేమకథగా తెరకెక్కించారు. 

Image result for ఆర్‌ఎక్స్‌ 100

ఫస్టాఫ్ అంతా రొమాన్స్‌తో సరిపెట్టాడు డైరెక్టర్ అజయ్‌భూపతి. సెకండాఫ్‌, థర్డ్‌పార్ట్‌కి వచ్చేసరికి రివేంజ్, ఫ్యామిలీ సెంటిమెంట్‌ని జోడించాడు. బలమైన ఎమోషన్స్‌తో పాటు కావలసినంత యాక్షన్, రొమాన్స్ చూపించాడు. మెయిన్ విలన్‌గా రావురమేష్‌‌తోపాటు సింధూర పువ్వు ఫేమ్ రాంకీ కనిపిస్తున్నారు. టోటల్‌గా ట్రైలర్ చూస్తే రొమాన్స్ విషయంలో నటీనటులు మోతాదుకి మించారనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.


గోదావరి జిల్లా నేటివిటితో సాగే పూర్తిస్థాయి లవ్‌స్టోరీ ఫిల్మ్ ఇది.‘ఆర్ఎక్స్ 100’ అనగానే ప్రేక్షకులు రకరకాలుగా ఊహించుకోవడం సహజం. నార్మల్‌గా ‘ఆర్ఎక్స్ 100’ బైక్ నడిపేవాళ్లు ఎమోషనల్‌, అగ్రెసివ్‌గా ఉంటారన్నది దర్శకుడి మాట. మూవీలో హీరో రోల్ కూడా అలాంటిదేనని అంటున్నాడు. ఈ చిత్రాన్ని తొలుత విజయ్ దేవరకొండ హీరోగా రూపొందించాలనుకున్నాడట దర్శకుడు.

Image result for ఆర్‌ఎక్స్‌ 100

 'పెళ్లిచూపులు' చిత్రం కంటే ముందే విజయ్‌ను కలసి ఈ స్టోరీ వినిపించానని.. కథ నచ్చినప్పటికీ ఇతర కమిట్మెంట్స్ వళ్ల విజయ్ నటించలేదని.. ఈ లోపు తాను వేరే వాళ్లతో ఈ చిత్రం చేశానంటున్నాడు దర్శకుడు. మూడేళ్ల క్రితమే తయారైన కథ కనుక.. 'అర్జున్ రెడ్డి' ప్రభావం లేదనేది దర్శకుడు వెర్షన్. ఇంతకూ ఈ ప్రభావం ఉందా లేదా అనేది తెలియాలంటే.. జులై 12 వరకూ ఆగితే చాలు అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: