సూపర్ చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయిన అనుష్క తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో మంచి అవకాశాలు దక్కించుకొని నెంబర్ వన్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.  రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క ఓ దర్శకుడి చేతిలో దారుణంగా మోసపోయిందట.  కెరీర్ బిగినింగ్ లో గ్లామర్ కి మంచి ప్రాదాన్యత ఇచ్చిన అనుష్క తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అరుంధతి’చిత్రం తర్వాత వరుసగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తుంది. 
Image result for ANUSHKA GAUTHAM MENON
ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న అనుష్క ‘బాహుబలి2’ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘భాగమతి’లో నటించింది.  ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.  అయితే భాగమతి సినిమా తర్వాత అనుష్క కు చాలా గ్యాప్ వచ్చింది.   సాధారణంగా హీరో హీరోయిన్లు దర్శకనిర్మాతలను నమ్మే చిత్రాలకు ఓకే చెబుతుంటారు. కొన్నిసార్లు కథలో అంత పట్టు లేకపోయినా, దర్శకుని మీద నమ్మకంతో సినిమా చేసి సక్సెస్‌ సాధించిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అనుష్క కూడా ఓదర్శకుడిని నమ్మి మోసపోయిందంటున్నారు టాలీవుడ్ వర్గాలు. 

ఇంతకీ ఆ దర్శకులు ఎవరో కాదు.. గౌతమ్‌మీనన్‌.  ‘బాహుబలి’ తరువాత అనుష్క గౌతమ్‌మీనన్‌తో ఓ చిత్రం చేయడానికి ఒప్పుకుంది. కానీ ఆ చిత్రం ఇంతవరకూ మొదలు కాలేదు...అసలు మొదలు అవుతుందో లేదో తెలియదు.  కానీ అప్పట్లో అనుష్క, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెగ వార్తలు వచ్చాయి. గౌతమ్ మీనన్ తో చిత్రం ఉందని ఫిక్స్ అయిన అనుష్క..మిగతా  చిత్రాలన్నీ రిజక్ట్ చేసిందట. గౌతమ్‌ మీనన్‌ నమ్మి మోసపోయానని అనుష్క ఇప్పుడు బాధపడుతోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: