మాన్లీ స్టార్ గోపిచంద్ తొలివలపు సినిమాతో హీరోగా పరిచయమైనా ఆ తర్వాత విలన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. యజ్ఞం సినిమాతో మళ్లీ హీరోగా మారి హిట్ కొట్టాడు. మాస్ హీరోగా బి,సి సెంటర్స్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న గోపిచంద్ రీసెంట్ గా పంతం అంటూ వచ్చి పర్వాలేదు అనిపించుకున్నాడు.


పంతం ఓ రెగ్యులర్ గా అనిపించే కథే.. కాని అందులో కొన్ని ఎలిమెంట్స్ ఆడియెన్స్ కు నచ్చేశాయి. అయితే సినిమా హిట్ కు ప్రధాన కారణాలు ఎన్నున్నా ఈసారి కూడా గోపిచంద్ సెంటిమెంట్ అతన్ని కాపాడాయని అంటున్నారు. తన మొదటి హిట్ సినిమా యజ్ఞం నుండి పంతం వరకు ఒకే రకమైన సెంటిమెంట్ గోపిచంద్ ను కాపాడుతూ వచ్చాయి.


అందులో ఒకటి రెండు అక్షరాల టైటిల్.. గోపిచంద్ చేసిన యజ్ఞం, రణం, లక్ష్యం, లౌఖ్యం ఇలా అన్ని హిట్ సాధించాయి. అయితే సౌఖ్యం అంటూ వచ్చినా అంతగా ఆకట్టుకోలేదు. ఈసారి పంతం మాత్రం రెండు అక్షరాల టైటిల్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యింది. అంతేకాదు చివరన 'o' సెంటిమెంట్ కూడా గోపిచంద్ సినిమా టైటిల్స్ కు ఉన్నాయి.   


ఆ లెక్కన 'o'తో ఎండ్ అయ్యే టైటిల్ ఉన్న గోపిచంద్ సినిమాలు  హిట్ సాధించాయి. మొత్తానికి ఎలాగోలా గోపిచంద్ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇకనుండైనా గోపిచంద్ కెరియర్ ప్లాన్ చేసుకుంటే బెటర్ లేదంటే మళ్లీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పంతంతో ఒక్క రోజు తేడాతో రిలీజ్ అయిన తేజ్ ఐలవ్యూ మాత్రం మళ్లీ మెగా ఫ్యాన్స్ ను నిరాశపరచేలా చేసింది.        



మరింత సమాచారం తెలుసుకోండి: