నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్-2 ఇప్పుడిప్పుడే కాస్త రసవత్తరంగా మారుతుందని చెప్పొచ్చు. ప్రతి శని, ఆదివారాలే కాదు సోమవారం కూడా బిగ్ బాస్-2 ఆడియెన్స్ ను అలరిస్తుంది. అలా ఎందుకు అంటే సోమవారం నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ క్రమంలో ఎవరెవరు ఎవరెవరిని నామినేట్ చేస్తారు అన్న ఎక్సైట్మెంట్ ఏర్పడుతుంది.


ఈ సోమవారం ఏకంగా బిగ్ బాసే ఇంటి సభ్యులను నామినేట్ చేయడం దాని నుండి తప్పించుకునేందుకు మిగతా వారిని హెల్ప్ అడగడం లాంటివి చేశారు. తేజశ్వి కోసం సామ్రాట్ క్లీన్ షేవ్ చేసుకోగా.. తనీష్ కోసం దీప్తి సునైనా హెయిర్ కట్ చేసుకుంది. అయితే దీప్తి కోసం కౌశల్, భాను కోసం అమిత్ వారిచ్చిన టాస్క్ చేయలేదు.


సో ఈ ఇద్దరు నామినేట్ అయ్యారు. వారితో పాటుగా గణేష్ కూడా తర్వాత నామినేషన్స్ లోకి వచ్చాడు. ముచ్చటగా ముగ్గురు ఈసారి నామినేషన్స్ లో ఉండబోతున్నారు. అయితే లాస్ట్ వీక్ దీప్తి చివరదాకా వచ్చి నామినేషన్ లో సేవ్ అయ్యింది. మరి ఈసారి భాను, దీప్తి, గణేష్ లలో ఎవరు ఇంటి బయటకు వచ్చేస్తారో చూడాలి.


ఇక బిగ్ బాస్-1 లో ఎన్.టి.ఆర్ తన హోస్టింగ్ టాలెంట్ తో అందరిని అలరించాడు. కంటెస్టంట్స్ అంతా తన మాట వినేలా తారక్ వస్తున్నాడంటేనే భయంతో వణికిపోయే వారు. కాని నాని మాత్రం అలా ఏమాత్రం కంటెస్టంట్స్ ను భయపెట్టడం లేదు సరికదా కనీసం నానిని హోస్ట్ అన్న మర్యాద కూడా లేకుండా సింగ్లర్ గా పిలుస్తున్నారు. మరి ఈ విషయంపై నాని కాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: