ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో లిప్ లాక్ సీన్లు కామన్ అయ్యాయి.  అసలు హీరో, హీరోయిన్ల మద్య లిప్ లాక్ సీన్ లేకుండా అబ్బే..సినిమాలో అసలు రొమాంటిక్ లేదని పెదవి విరస్తున్నారు ప్రేక్షకులు.  వాస్తవానికి ఒకప్పుడు ముద్దు సీన్లు అంటేనే హీరోయిన్లు ఆమడ దూరం వెళ్లేవారు..లిప్ లాక్ సీన్లు అంటే హాలీవుడ్ లో మాత్రమే అనుకునే వారు..కానీ ఆ సాంస్కృతి బాలీవుడ్ కి పాకింది..తర్వాత అన్ని సినిమా ఇండస్ట్రీలకు ఇది కామన్ అయ్యింది. 
Related image
ఈ మద్య వస్తున్న హీరోయిన్లు కూడా లిప్ లాక్ సీన్లు చాలా ఈజీగా తీసుకుంటున్నారు..ఒక్కో దశలో హీరో కన్నా వీరే ఇలాంటి సీన్లు పండిస్తున్నారు.  నేను శైలజ, నేను లోకల్, మహానటి తో తెలుగులో మంచి ఇమేజ్ తెచ్చుకున్న నటి కీర్తి సురేష్.   మొదటి నుంచి చాలా సాంప్రదాయంగా వస్తున్న కీర్తి సురేష్ ‘మహానటి’ సినిమాతో ఎక్కడ లేని పాపులారిటీ తెచ్చుకుంది.  అయితే కీర్తి మొదటి నుంచి ముద్దంటే తనకు చేదుతో సమానం అంటోంది కీర్తి సురేష్‌. ఇక మహానటి సూపర్ హిట్ తర్వాత వరుసగా ఛాన్స్ లు రావడం మొదలయ్యాయి. 
Image result for keerthi suresh
అంతా బాగానే ఉంది కానీ, కొందరు తనని ముద్దు సన్నివేశాలలో నటించమని అడుగుతున్నారనీ, అయితే అలాంటి సన్నివేశాలలో నటించనని గతంలో చాలాసార్లు చెప్పినా కొందరు వినిపించుకోవడం లేదని కీర్తి వాపోతోంది.  ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎవరూ ఇలా అడగలేదని..కాస్త క్రేజ్ వచ్చిన తర్వాత ముద్దు సీన్లు గోల మొదలైందని తెగ బాధపడిపోతుంది కీర్తి సురేష్. కానీ తను అలాంటి సన్నివేశాలు చేయనని తెగేసి చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: