తమిళ నటుడు సూర్యకు కోలీవుడ్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో అదేవిధంగా తెలుగులో కూడా అదే రేంజ్ క్రేజ్ ఏర్పరచుకున్నాడు. గజిని సినిమా నుండి సూర్య తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇక సూర్య తర్వాత తెరంగేట్రం చేసిన తమ్ముడు కార్తి కూడా తమిళంలో హీరోగా నిలబడటమే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.


తెలుగులో సూర్య కన్నా అనర్గళంగా మాట్లాడగలిగే కార్తి ఆవారా నుండి లాస్ట్ ఇయర్ వచ్చిన ఖాకి వరకు హిట్లు కొడుతూనే ఉన్నాడు. మరో రెండు రోజుల్లో చినబాబుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కార్తి తన సూపర్ హిట్ సినిమా ఖాకి సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నట్టు తెలిపాడు.


పి.ఎస్ వినోద్ డైరక్షన్ లో వచ్చిన ఖాకి సినిమా యాక్షన్ అడ్వెంచర్ గా సాగింది. వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. కార్తి సత్తా చాటేలా మరోసారి ఈ సినిమా వసూళ్లను తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా సీక్వల్ పై కన్నేశాడు కార్తి.


ఆల్రెడీ లైన్ సిద్ధం చేశాడట వినోద్. ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయడమే ఆలస్యం సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. ఖాకి సినిమాలానే ఇది కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా గురించి మిగతా డీటైల్స్ త్వరలో వెళ్లడించే అవకాశం కనిపిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: