తేజ డైరక్షన్ లో మొదలైన ఎన్.టి.ఆర్ బయోపిక్ అనివార్య కారణాల వల్ల క్రిష్ చేతుల్లోకి వచ్చింది. తండ్రి బయోపిక్ లో నటించేందుకు బాలకృష్ణ చూపిస్తున్న ఆసక్తి అందరికి తెలిసిందే. సినిమా మొత్తంలో 60 గెటప్పులలో కనిపిస్తారట బాలకృష్ణ. ఎన్.బి.కె ప్రొడక్షన్స్ బ్యానర్ లో బాలయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు.


ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమాలో మోక్షజ్ఞ కూడా ఉంటున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో మరో వారసుడు తెరంగేట్రం చేస్తున్నాడన్నమాట. బాలయ్య బాబు పర్యవేక్షణలో మోక్షజ్ఞ ఎంట్రీ జరుగుతుంది. ఎన్.టి.ఆర్ టీనేజ్ పాత్రలో మోక్షజ్ఞ కనిపిస్తాడట.


అసలైతే మోక్షజ్ఞ హీరోగా క్రిష్ డైరక్షన్ లోనే ఓ సినిమా అనుకున్నారు. కాని అది ఎందుకో అటకెక్కింది. అయితే ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత ఒకవేళ ఆ సినిమా ఉండే అవకాశం ఉందట. ప్రస్తుతం మోక్షజ్ఞ యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకునే పనిలో ఉన్నాడు. లుక్ విషయంలో కూడా మోక్షజ్ఞ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. 


తండ్రి బయోపిక్ లో తనయుడిగా బాలకృష్ణ ఎన్.టి.ఆర్ బయోపిక్ పై స్పెషల్ క్రేజ్ రాగా అందులో తాత పాత్రని తను కూడా వేయడం అంటే మోక్షజ్ఞకు అంతకుమించిన అదృష్టం ఇంకేముంటుంది. కచ్చితంగా ఈ సినిమా బాలకృష్ణ చరిత్రలోనే కాదు బయోపిక్ సినిమాల్లో కూడా సంచలంగా మారేలా తీర్చిదిద్దుతున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: