తెలుగు లో సీనియర్ హీరోస్ అంటే మొదటగా గుర్తొచ్చేది చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. అయితే వీరిలో మెగాస్టార్ చిరంజీవి మార్కెట్ ఇప్పటికీ అలానే ఉంది. బాలకృష్ణ సినిమా కూడా హిట్ అయితే బాగానే వసూలు చేస్తుంది. అయితే మిగిలిన హీరోలా పరిస్థితి దీనికి భిన్నముగా ఉందని చెప్పాలి. వెంకటేష్ సోలో హీరోగా చేసిన సినిమా లు  ఈ మధ్య లేవనే చెప్పాలి. అందుకే మల్టీ స్టారర్ లో నటిస్తున్నాడు. నాగార్జున కూడా ఇంచు మించు అంతే అని చెప్పాలి. 

Image result for venkatesh and nagarjuna

కొన్నాళ్లుగా నాగ్, వెంకీ స్టార్ ఇమేజ్ ఉన్న మ‌రో హీరోతో క‌లిసి సినిమాలు చేస్తున్నారు. క‌థ ప‌క్కాగా ఉంటేనే ఒంటిగా బ‌రిలోకి దిగేది లేదంటే? ఖాళీగా ఉండ‌ట‌మే ఉత్త‌మం అని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం నాగార్జున‌, నానితో క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా సెట్స్ లో ఉంది. నాని ఉన్నాడు కాబ‌ట్టి సినిమా మంచి బిజినెస్ జ‌రుగుతుంది. నాగ్ పేరుతో కొన్ని ఏరియాల్లో అమ్ముడు పోతుంది. ఇద్దరు స్టార్లు కాబ‌ట్టి శాటిలైట్ కూడా బాగానే ప‌లుకుతుంది.

Image result for venkatesh and nagarjuna

యూ ట్యూబ్ రైట్స్ రూపంలో కూడా నిర్మాత‌ల‌కు బాగానే ముడుతుంది. ఆ లెక్క‌ల ప్ర‌కార‌మే నిర్మాత‌లు సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా బ‌డ్జెట్ 20 కోట్ల‌ల‌లో పూర్తి చేసి 40 కోట్లు బిజినెస్ ఈజీగా జ‌రిగిపోతుంది. అటు వెంక‌టేష్ ప‌రిస్థితి దారుణంగానే ఉంది. క‌థాబ‌లం ఉన్న సినిమాల‌కు చూస్తున్నా రావ‌డం లేదు. దీంతో ఆయ‌న కూడా మ‌ల్టీస్టార‌ర్లు బెట‌ర్ అని ఆ సినిమాలే చేస్తున్నారు. ప్ర‌స్తుతం వ‌రుణ్ తో జ్ తో క‌లిసి `ఎఫ్‌2` అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవ‌లే సినిమా ప్రారంభ‌మైంది. వ‌రుణ్ పేరుతో సినిమా బిజినెస్ అవుతుంది. వెంకీ బ్రాండ్ తో కొన్ని ఏరియాల్లో అమ్ముడు పోతుంది.





మరింత సమాచారం తెలుసుకోండి: